Crime News: ఈ చేతి పంపు వల్లే ఓ మహిళ ప్రాణం పోయింది.. నీళ్ల కోసం వెళ్లిన ఆమె చివరకు రక్తపు మడుగులో..

ABN , First Publish Date - 2023-04-21T12:07:26+05:30 IST

చేతి పంపు నుంచి నీళ్లు తోడుతున్న మహిళపై ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు. వ్యక్తిగత కక్షలతో ఆమెను ఇనుప రాడ్లతో కొట్టారు. తీవ్ర గాయాల పాలైన ఆ మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.

Crime News: ఈ చేతి పంపు వల్లే ఓ మహిళ ప్రాణం పోయింది.. నీళ్ల కోసం వెళ్లిన ఆమె చివరకు రక్తపు మడుగులో..

చేతి పంపు (Hand Pump) నుంచి నీళ్లు తోడుతున్న మహిళపై ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు. వ్యక్తిగత కక్షలతో ఆమెను ఇనుప రాడ్లతో కొట్టారు. తీవ్ర గాయాల పాలైన ఆ మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) లాల్‌పూర్ గ్రామంలో ఈ అమానుష ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సాధన అనే 40 ఏళ్ల మహిళ నీళ్ల కోసం చేతి పంపు దగ్గరకు వెళ్లింది. పంపు నుంచి సాధన నీళ్లు తోడుకోవడాన్ని సుధీర్ కుమార్, సందీప్, ప్రేమపాల్ అనే వ్యక్తులు అడ్డుకున్నారు (Crime News).

సాధనపై ముగ్గురూ కలిసి ఇనుప రాడ్లతో దాడి చేశారు. అడ్డుకునేందుకు వచ్చిన ఆమె భర్త రింకూను కూడా కొట్టారు. ఆ దాడిలో సాధన తీవ్రంగా గాయపడింది. గాయాల పాలైన సాధనను స్థానికుల సహాయంతో భర్త స్థానిక ఆస్పత్రికి తరలించాడు. అప్పటికే తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమెను జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిందిగా వైద్యులు సూచించారు. జిల్లా ఆస్పత్రిలో సాధన చికిత్స పొందుతూ మరణించింది. సమాచారం అందుకున్న పోలీసులు రింకూ ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితులపై కేసు పెట్టారు (Woman thrashed by 3 men).

Viral Video: ఎవరూ చూడటం లేదని రెచ్చిపోయిన అంకుల్.. యువతితో రొమాన్స్ స్టార్ట్.. మేడపై నుంచి ఓ వ్యక్తి సీక్రెట్‌గా వీడియో తీసి మరీ..

నిందితులు ముగ్గురినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో కులం కోణం లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఈ కేసులో బాధితులు, నిందితులది ఒకే కులం అని, కుటుంబ గొడవల కారణంగానే ఈ దాడికి పాల్పడ్డారని తెలిపారు. తాము ఆస్పత్రిలో ఉన్న సమయంలో నిందితులు తమ ఇంటికి కూడా నిప్పు పెట్టారని రింకూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు.

Updated Date - 2023-04-21T12:07:26+05:30 IST