Viral Video: ఇదేం పనమ్మా తల్లీ.. సోదరుడి అస్తికలను ఆ మహిళ ఇలా చేస్తోందేంటి..?

ABN , First Publish Date - 2023-09-23T16:27:22+05:30 IST

సాధారణంగా ఇంట్లో వారు ఎవరైనా మరణిస్తే వారి అంత్యక్రియలను అత్యంత గౌరవపూర్వకంగా నిర్వహిస్తారు. హిందూ సాంప్రదాయం ప్రకారం అయితే మరణించిన వారి అస్థికలను ఏదైనా పవిత్ర నదిలో కలపాలని కుటుంబ సభ్యులు భావిస్తారు. ఇతర మతాల్లో కూడా మరణించిన కుటుంబ సభ్యుల అస్థికలకు ఎంతో మర్యాద ఇస్తారు.

Viral Video: ఇదేం పనమ్మా తల్లీ.. సోదరుడి అస్తికలను ఆ మహిళ ఇలా చేస్తోందేంటి..?

సాధారణంగా ఇంట్లో వారు ఎవరైనా మరణిస్తే వారి అంత్యక్రియలను అత్యంత గౌరవపూర్వకంగా నిర్వహిస్తారు. హిందూ సాంప్రదాయం ప్రకారం అయితే మరణించిన వారి అస్థికలను (Ashes) ఏదైనా పవిత్ర నదిలో కలపాలని కుటుంబ సభ్యులు భావిస్తారు. ఇతర మతాల్లో కూడా మరణించిన కుటుంబ సభ్యుల అస్థికలకు ఎంతో మర్యాద ఇస్తారు. అయితే తాజాగా ఓ మహిళ తన సోదరుడి అస్థికలతో (Brother`s ashes) చాలా అగౌరవంగా వ్యవహరించింది. ఓ డీజే పార్టీలో పాల్గొని స్విమ్మింగ్ పూల్‌లో డ్యాన్స్ చేస్తూ చల్లేసింది.

@ClownWorld_ అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో (Viral Video) ఓ స్విమ్మింగ్ పూల్ పార్టీ జరుగుతోంది. వెనుక డీజే సాంగ్స్ వినబడుతున్నాయి. స్విమ్మింగ్ పూల్‌లో చాలా మంది సరదాగా నవ్వుతూ, తుళ్లుతూ గడుపుతున్నారు. ఆ సమయంలో ఓ మహిళ బాటిల్‌లో ఉన్న తన సోదరుడి అస్థికలను మూత తీస ఆ స్విమ్మింగ్ పూల్‌లో చల్లింది. ఆ సమయంలో ఆమె సరదగా డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ఓ వ్యక్తి ఆమెను గమనించి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral Video: ఎక్కడి నుంచి వస్తాయయ్యా.. ఇలాంటి ఐడియాలు.. బాటిల్ మూతతో తలుపులకు తాళాన్నే తయారు చేశాడుగా..!

ఆ వీడియో ఇప్పటివరకు 3.7 లక్షల మంది వీక్షించారు. చాలా మంది ఆ వీడియోపై తమ అభిప్రాయాలను తెలియజేశారు. కొంత మంది ఆమెను తీవ్రంగా విమర్శించారు. కొందరు మాత్రం ఆమెకు మద్దతుగా నిలిచారు. ``ఆమె ఏం చేస్తోంది.. ఇదేనా సోదరుడికి ఇచ్చే మర్యాద``, ``ఆమె మత్తులో అలా చేస్తోంది``, ``ఆమె చేసిన దాంట్లో తప్పేముంది``, ``ఆమె తన సోదరుడితో కలిసి పార్టీ చేసుకోవాలనుకుంటోంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - 2023-09-23T16:27:22+05:30 IST