Viral Video: ముంబైలో మహిళా ఉద్యోగుల కష్టాలు చూశారా? కదులుతున్న ట్రైన్‌లోకి ఎలా ఎక్కుతున్నారో.. వీడియోపై ఆగ్రహం..

ABN , First Publish Date - 2023-09-18T17:55:17+05:30 IST

మన దేశంలోని మెట్రో నగరాల్లో ఉండే ట్రాఫిక్ గురించి, జనాలతో కిక్కిరిసిపోయిన వాహనాల గురించి తెలిసిందే. ముఖ్యంగా స్కూళ్లు, ఆఫీస్‌లకు వెళ్లే సమయాల్లో ఉండే రద్దీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ముఖ్యంగా ముంబై మహానగరంలో ఈ రద్దీ తారస్థాయిలో ఉంటుంది.

Viral Video: ముంబైలో మహిళా ఉద్యోగుల కష్టాలు చూశారా? కదులుతున్న ట్రైన్‌లోకి ఎలా ఎక్కుతున్నారో.. వీడియోపై ఆగ్రహం..

మన దేశంలోని మెట్రో నగరాల్లో ఉండే ట్రాఫిక్ గురించి, జనాలతో కిక్కిరిసిపోయిన వాహనాల గురించి తెలిసిందే. ముఖ్యంగా స్కూళ్లు, ఆఫీస్‌లకు వెళ్లే సమయాల్లో ఉండే రద్దీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ముఖ్యంగా ముంబై (Mumbai) మహానగరంలో ఈ రద్దీ తారస్థాయిలో ఉంటుంది. పురుషుల సంగతి పక్కన పెడితే ఇంటి పని చేసుకుని ఆఫీస్‌కు బయల్దేరే మహిళలైతే రాకపోకల కోసం ఓ యుద్ధమే చేయాలి. ట్రైన్‌లో సీటు (Seat) కోసం వారు పడే ప్రయాస చేస్తే ఎంతో జాలి కలుగుతుంది.

ట్రైన్‌లో సీటు కోసం వారు ఎంతో రిస్క్ చేస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది. ముంబై లోకల్ ట్రైన్‌లో (Mumbai Local Train) సీట్ కోసం కదులుతున్న ట్రైన్‌లోకి ఆదరాబాదరాగా ప్రయాణికులు తోసుకుంటూ ఎక్కడం నిత్యం మనం చూస్తూనే ఉంటాం. ఆ సమయంలో ఏ కాస్త పొరపాటు జరిగినా తీవ్ర ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుంది. @akshaykatariyaa అనే ట్విటర్ యూజర్ ఆ వీడియోను షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో లోకల్ ట్రైన్ స్టేషన్‌లోకి వచ్చి ఆగక ముందే మహిళలు ఒకరినొకరు తోసుకుంటూ లోపలికి ఎక్కేస్తున్నారు.

వేగంగా లోపలికి ఎక్కిన తర్వాత బ్యాలెన్స్ కంట్రోల్ చేసుకోవడానికి కొందరు ఆపసోపాలు పడుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇప్పటివరకు 24 లక్షల మంది వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ``కేవలం సీటు కోసం వారు తమ ప్రాణాలను, పక్క వారి ప్రాణాలను రిస్క్‌లో పెడుతున్నారు``, ``ఇలాంటి సమయంలోనే దొంగలు కూడా రెచ్చిపోతారు``, ``ఏ మాత్రం తేడా వచ్చినా ప్రమాదమే`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-09-18T17:55:17+05:30 IST