Women Health: ఆడవాళ్లు బలంగా ఉండాలంటే ఏం తినాలి? ఆయుర్వేదం చెప్పిన ఆహార రహస్యాలివీ..
ABN , First Publish Date - 2023-12-03T14:33:59+05:30 IST
ఆయుర్వేదం చెప్పిన ఈ 5 ఆహారాలు తింటే చాలు.. మహిళల జబ్బులన్నీ మంత్రించినట్టు మాయమవ్వాల్సిందే..
ఆడవాళ్లకు ప్రతి దశలోనూ ఆరోగ్య సమస్యలు కొత్తగా పుడుతూనే ఉంటాయి. నెలసరి సరిగా రాకపోవడం, నెలసరిలో నొప్పి, అధిక రక్తస్రావం, పిల్లలు పుట్టడంలో ఇబ్బందులు, శారీరక బలహీనత, నీరసం, అలసట, ఊబకాయం, థైరాయిడ్, మెనోపాజ్ ఇలా వీటి లిస్ట్ చాలా పెద్దదే. అయితే వీటన్నింటిని అధిగమించాలన్నా, శారకంగా బలంగా ఉండాలన్నా మహిళలు కింద పేర్కొన్న ఆహారాలను తీసుకోవాలని చెబుతోంది. ఈ ఆహారాలు ఆడవాళ్లకు అమృతంతో సమానమని చాలా బలంగా తయారవుతారని పేర్కొంది. ఆ ఆహారాల లిస్ట్ ఏంటో చూస్తే..
కొబ్బరి(Coconut)
కొబ్బరి వాత , పిత్త దోషాలను సమతుల్యంగా ఉండేలా చేస్తుంది. శరీర బలాన్ని పెంచడంలో, ఎముకలు ఆరోగ్యంగా ఉంచడంలో, థైరాయిడ్ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. శరీరానికి చలువ చేస్తుంది. ప్రతిరోజూ ఓ చిన్న కొబ్బరిముక్క తింటే మంచిది.
ఇది కూడా చదవండి: Viral Video: వీళ్ల టెక్నాలజీ వాడకం మామూలుగా లేదుగా.. రూ.15కోట్ల కారును 30సెకెన్లలో ఎలా ఎత్తుకెళ్లారో చూస్తే..
నల్ల ఎండుద్రాక్ష(Black raisins)
ప్రతి మహిళ ఉదయాన్ని నల్ల ఎండుద్రాక్షతో ప్రారంభిస్తే బోలెడు రోగాలు దూరమవుతాయి. ఇది పిత్త దోషాన్ని తగ్గింస్తుంది. ఇందులో ఐరన్ అధికంగా ఉంటుంది. హిమోగ్లోబిన్ ను ప్రోత్సహించి రక్తహీనతను తగ్గిస్తుంది. ప్రేగులను శుభ్రం చేస్తుంది. లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది. నెలసరి సమస్యలు పరిష్కరిస్తుంది.
నువ్వులు(sesame)
నాడీ వ్యవస్థ నుండి కండరాలు, ఎముకల ఆరోగ్యం వరకు అన్ని సమస్యలను నువ్వులు పరిష్కరిస్తాయి. వాత సమస్యలను సరిచేస్తాయి. నెలసరి రావడానికి 15 రోజుల ముందు ప్రతిరోజూ 1 టీస్పూన్ వేయించిన నువ్వులు తింటే నెలసరి సమస్యలన్నీ తగ్గిపోతాయి.
ఖర్జూరం(Dates)
మహిళలలో బలహీనతను తరిమికొట్టడంలో ఖర్జూరం సహాయపడుతుంది. ఐరన్ లోపమున్నా, నెలసరి సమస్యలు వేధిస్తున్నా.. అలసట, నీరసం వంటి సమస్యలున్నా ప్రతిరోజూ ఖర్జూరం తింటూ ఉంటే శరీరానికి బోలెడంత శక్తి లభిస్తుంది.
ఉసిరి(Gooseberry)
ఉసిరికి ఆయుర్వేదంలో గొప్ప స్థానం ఉంది. అన్ని వయసుల మహిళలు ఉసిరిని ఆహారంలో చేర్చుకోవాలి. ఉసిరి పొడి, ఉసిరి జ్యూస్, ఉసిరి క్యాండీ, పచ్చి ఉసిరి. ఇలా చాలా విధాలుగా ఉసిరిని తీసుకోవచ్చు. ఇది శరీరానికి బలాన్ని చేకూరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణాశయ సమస్యలను, మలబద్దకాన్ని పరిష్కరిస్తుంది. యవ్వనంగా ఉంచుతుంది.
(గమనిక: ఈ సమాచారం వైద్యులు, ఆహార నిపుణులు పలుచోట్ల పేర్కొన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. ఆరోగ్యం గురించి ఏమైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించడం మంచిది)