నువ్వు రావద్దు.. నేనే వస్తున్నా.. కింద ఉన్న ఫ్రెండ్‌కు ఫోన్ చేసి ఏడో అంతస్థు నుంచి దూకేశాడు.. పర్సులో దొరికిన లేఖలో..
ABN , First Publish Date - 2023-01-07T16:15:59+05:30 IST
మానసిక ఒత్తిడిని భరించలేక కొందరు, కుటుంబ సమస్యల కారణంగా మరికొందరు.. ప్రేమలో విఫలమై ఇంకొందరు చివరకు సంచలన నిర్ణయాలు తీసుకుంటారు. రాజస్థాన్‌లో ఓ యువకుడు కూడా ఇలాగే చేశాడు. కళాశాలకు వెళ్తున్నానంటూ ఇంటి నుంచి వెళ్లాడు. మరుక్షణంలో..
మానసిక ఒత్తిడిని భరించలేక కొందరు, కుటుంబ సమస్యల కారణంగా మరికొందరు.. ప్రేమలో విఫలమై ఇంకొందరు చివరకు సంచలన నిర్ణయాలు తీసుకుంటారు. రాజస్థాన్‌లో ఓ యువకుడు కూడా ఇలాగే చేశాడు. కళాశాలకు వెళ్తున్నానంటూ ఇంటి నుంచి వెళ్లాడు. మరుక్షణంలో సమీపంలోని ఓ భవనంపై ప్రత్యక్షమయ్యాడు. అనంతరం అర్జంట్‌గా మాట్లాడాలంటూ స్నేహితుడికి కాల్ చేశాడు. భవనం పైకి వస్తున్న స్నేహితున్ని .. నువ్వు రావద్దు.. నేనే వస్తున్నా.. అంటూ ఆపాడు. చూస్తుండగానే ఏడో అంతస్థు నుంచి అమాతం దూకేశాడు. చివరకు పోలీసులు అతడి పర్సులో ఓ లేఖను స్వాధీనం చేసుకున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
రాజస్థాన్ (Rajasthan) జైపూర్ పరిధి చాంద్‌పోల్ మాలి కాలనీకి చెందిన దీప్‌చంద్ కుమావత్ కుమారుడు కతిర్కే కుమావత్(20).. ఎల్ఎల్‌బీ (LL.B) మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇదివుండగా, బుధవారం కళాశాలకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయలేదేరాడు. అయితే సమీపంలో నిర్మాణంలో ఉన్న పెద్ద భవనంపైకి ఎక్కాడు. ఏడో అంతస్తులో కూర్చుని, తన స్నేహితుడు విశాల్‌కు ఫోన్ చేసి రమ్మని పిలిచాడు. కాసేపటికి అక్కడికి చేరుకున్న విశాల్.. కతిర్కేతో ఫోన్‌లో మాట్లాడుతూ, నేనే పైకి వస్తున్నా.. అని చెప్పాడు. దీంతో కతిర్కే వద్దు నేనే కిందకు వస్తున్నా ఉండు.. అంటూ ఫోన్ పెట్టేశాడు. మరుక్షణంలోనే ఊహించని విధంగా ఏడో అంతస్తు నుంచి అమాంతం కిందకు (suicide) దూకేశాడు. ఈ ప్రమాదంలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు.
అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహం జేబులో ఉన్న సూసైడ్ నోట్‌ను (Suicide note) స్వాధీనం చేసుకున్నారు. అందులో, ‘‘ నా ప్రియురాలి కుటుంబ సభ్యులు నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నారు’’.. అని రాసి ఉంది. కతిర్కే స్నేహితుడు విశాల్‌ను విచారించగా అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. రెండేళ్ల క్రితం కతిర్కేకు, సురేఖ రోనీ యువతితో స్నేహం ఏర్పడింది. తర్వాత వీరి మధ్య ప్రేమాయణం (love) నడిచింది. ఈ విషయం సురేఖ కుటుంబ సభ్యులకు తెలియడంతో గొడవలు (quarrels) మొదలయ్యాయి. అప్పటినుంచి చంపేస్తామంటూ కతిర్కేను తరచూ బెదిరించేవారు. ఈ వేధింపులు తట్టుకోలేకే కతిర్కే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
Viral Video: ఇతడి తెలివిని చూసి ఆనంద్ మహీంద్రాయే అవాక్కయ్యారు.. రూపాయి ఖర్చు లేకుండా..