Viral Video: నడిరోడ్డుపై మహిళా కానిస్టేబుల్కు ముద్దు పెట్టిన యువకుడు.. ఆమె రియాక్షన్ ఏంటంటే..
ABN , First Publish Date - 2023-05-28T16:03:53+05:30 IST
చట్టాలను అమలు చేయడం ద్వారా నేరాలను నిరోధించడంతోపాటు శాంతి భద్రతలను కాపాడటం పోలీసుల ప్రధాన విధి. అంతేకాదు అవసరమైనప్పుడు ప్రజలకు అండగా నిలవడం కూడా వారి బాధ్యత. అయితే, కొన్నిసార్లు, పోలీసులకు కూడా ఊహించని సందర్భాలు ఎదురవుతాయి.
చట్టాలను అమలు చేయడం ద్వారా నేరాలను నిరోధించడంతోపాటు శాంతి భద్రతలను కాపాడటం పోలీసుల (Police)ప్రధాన విధి. అంతేకాదు అవసరమైనప్పుడు ప్రజలకు అండగా నిలవడం కూడా వారి బాధ్యత. అయితే, కొన్నిసార్లు, పోలీసులకు కూడా ఊహించని సందర్భాలు ఎదురవుతాయి. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో (viral Video)ఓ మహిళ పోలీసుకు అలాంటి అనుభవమే ఎదురైంది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
sanscari._.ladka అనే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఈ వీడియో షేర్ అయింది. ఆ వీడియోలో ఓ మహిళా కానిస్టేబుల్ రోడ్డు మీద ఓ యువకుడిని ఓదారుస్తోంది. అతడి చెంపపై నిమురుతూ అతడితో ఏదో చెబుతోంది. అదే అదనుగా తీసుకున్న ఆ యువకుడు ఆమెను కౌగిలించుకున్నాడు. అయినా ఆమె పెద్దగా ఫీలవలేదు. ఆ తర్వాత ఒక్కసారిగా ఆమెను ముద్దు పెట్టేసుకున్నాడు (Young man kisses lady cop). అయినా ఆ మహిళా పోలీసు కోపం తెచ్చుకోకుండా షాక్లో నవ్వుతూ ఉండిపోయింది. ఇంతలో ఓ వ్యక్తి ఆ యువకుడిని పక్కకు లాక్కెళ్లిపోయాడు.
Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. రోడ్డుపై ఉన్న మొసలిని చంపాలనుకున్నాడు.. తర్వాతేం జరిగిందో మీరే చూడండి..
మహిళా పోలీసు బంగ్లాదేశ్ (Bangladesh) పోలీస్ యూనిఫాంలో కనిపించడంతో ఈ ఘటన బంగ్లాదేశ్లో జరిగినట్లు తెలుస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దాదాపు 32 వేల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఆ పోలీస్ రియాక్షన్ చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది.