Viral Video: రోడ్డు దాటడానికి ఇలాంటి ట్రిక్ ఉపయోగించాలా? వైరల్ అవుతున్న యువకుడి ఫన్నీ వీడియో!

ABN , First Publish Date - 2023-07-09T16:57:10+05:30 IST

మెట్రో నగరాల్లో రోడ్డు దాటడం అంటే మాటలతో పని కాదు. వాహనాల రద్దీతో ఎంతో బిజీగా ఉండే రోడ్లను దాటడం పెద్ద సవాలే. వచ్చే పోయే వాహనాలను జాగ్రత్తగా చూసుకుంటూ రోడ్డు దాటడానికి ఆపసోపాలు పడాలి. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో కుర్రాడు రోడ్డు దాటడానికి సులభమైన మార్గం కనుగొన్నాడు.

Viral Video: రోడ్డు దాటడానికి ఇలాంటి ట్రిక్ ఉపయోగించాలా? వైరల్ అవుతున్న యువకుడి ఫన్నీ వీడియో!

మెట్రో నగరాల్లో (Metro cities) రోడ్డు దాటడం అంటే మాటలతో పని కాదు. వాహనాల రద్దీతో (Traffic) ఎంతో బిజీగా ఉండే రోడ్లను దాటడం పెద్ద సవాలే. వచ్చే పోయే వాహనాలను జాగ్రత్తగా చూసుకుంటూ రోడ్డు దాటడానికి ఆపసోపాలు పడాలి. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో కుర్రాడు రోడ్డు దాటడానికి సులభమైన మార్గం కనుగొన్నాడు (amazing trick to cross the road). ఆ ఫన్నీ వీడియో (Funny Video) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Adil Loui అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు.

వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వికలాంగుడు రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తున్నాడు. చేతులతో సంజ్ఞలు చేస్తూ వాహనాలను ఆగమని చెప్పి కుంటు కుంటూ రోడ్డు దాటాడు. కొద్ది దూరం వెళ్లాక మామూలుగా మారిపోయి స్టైల్‌గా నడుచుకుంటూ ముందుకు వెళ్లిపోయాడు. అంటే రోడ్డు దాటడానికి ఆ యువకుడు వేసిన అద్బుతమైన ప్లాన్ అన్నమాట. ఆ కుర్రాడి చేష్టలను ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral Video) మారింది.

Viral Video: వామ్మో.. చెట్టంత పొడవున్న అనకొండ.. భారీ కొండచిలువను చూసి షాకవుతున్న నెటిజన్లు!

ఈ ఫన్నీ వీడియోను ఇప్పటివరకు 12 లక్షల మంది వీక్షించారు. 94 వేల మందికి పైగా లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ``ఈ బ్రదర్‌కు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి``, ``సూపర్ ట్రిక్``, ``ఢిల్లీలో అలా చేసినా వాహనాలు ఆగవు`` అంటూ కొందరు కామెంట్లు చేశారు.

Updated Date - 2023-07-09T16:57:10+05:30 IST