పాపం.. ఈ 21 ఏళ్ల యువతికి ఎంత కష్టమొచ్చింది..? కేన్సర్ ట్రీట్మెంట్ కోసం నగ్న చిత్రాలను ఆన్‌లైన్‌లో పెట్టి మరీ..

ABN , First Publish Date - 2023-03-02T16:36:20+05:30 IST

కొంత మంది బాధలను చూసి ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదంటారు. చిన్న వయసు. అంతలోనే పెద్ద కష్టం. ఆ యువతికి అనుకోని పెద్ద సమస్య వచ్చి పడింది. జీవితం సాఫీగా

పాపం.. ఈ 21 ఏళ్ల యువతికి ఎంత కష్టమొచ్చింది..? కేన్సర్ ట్రీట్మెంట్ కోసం నగ్న చిత్రాలను ఆన్‌లైన్‌లో పెట్టి మరీ..
ఆన్‌లైన్‌లో పెట్టి మరీ..

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఇది ముమ్మాటికీ వాస్తవం. అయితే మనిషి జీవన విధానంలో వచ్చిన మార్పులో... లేదంటే ప్రకృతిలో వచ్చిన మార్పులో తెలియదు గానీ.. ప్రస్తుతం కొత్త.. కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. రెండేళ్ల కిందట వచ్చిన కరోనాకు మందు కనిపెట్టేలోపే కొన్ని లక్షల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అయితే కొన్ని రోగాలకు లక్షల్లో ధారపోస్తేనే గానీ గట్టెక్కే పరిస్థితి లేదు. అందులో గుండె, కేన్సర్ రోగాలు ప్రధానమైనవి. ఇక పేదరికం అయితే అంతే సంగతులు. ఆశలు వదిలేసుకుంటారు. దేవుడే దిక్కు అని దేవుడిపైనే భారం వేస్తుంటారు. ఇంతకీ అసలేం ఏమైందనే కదా? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే!

కొంత మంది బాధలను చూసి ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదంటారు. చిన్న వయసు. అంతలోనే పెద్ద కష్టం. ఆ యువతికి అనుకోని పెద్ద సమస్య వచ్చి పడింది. జీవితం సాఫీగా సాగిపోతున్న తరుణంలో ఊహించని కుదుపు. ఆస్పత్రికి వెళ్లి టెస్ట్‌లు చేయించుకుంది. అంతే గుండె పగిలే వార్త చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయింది. చూస్తే చేతిలో చిల్లిగవ్వ లేదు. రోగమేమో పెద్దది... ఖర్చు చూస్తే బారెడు.. ఏం చేయాలో అర్థంకాలేదు. చివరికి ఆ అమ్మాయి తీసుకున్న నిర్ణయానికి ఆవేదన కలగకుండా ఉండదు.

అమెరికాకు (America) చెందిన మియ రిచర్డ్‌సన్‌ (Mia Richardson) వయసు 21 ఏళ్లు. జీవితం సాఫీగా సాగిపోతుంది. అంతే ఒక్కసారిగా భారీ కుదుపు. వైద్య పరీక్షలో కేన్సర్ వ్యాధి బయటపడింది. చికిత్సకు అయ్యే ఖర్చు విన్న ఆమె చేతులెత్తేసింది. కానీ మరోవైపు ఎలాగైనా రోగాన్ని జయించాలని డిసైడ్ అయింది. అంతే ఆమె తన నగ్న చిత్రాలను కొన్ని పెయిడ్ వెబ్‌సైట్లలో ఉంచింది. వాటి ద్వారా వచ్చే డబ్బుతో కేన్సర్ ట్రీట్‌మెంట్ (Cancer treatment) తీసుకుంటూ వచ్చింది. ఇప్పటి వరకు 80 వేల డాలర్ల వరకు వచ్చాయి. గత సెప్టెంబర్‌లో కేన్సర్ నిర్ధారణ కావడంతో అప్పటినుంచి కీమోథెరపీ (Chemotherapy), రేడియేషన్ చికిత్సలు తీసుకుంది. అయితే రేడియేషన్ (Radiation) కారణంగా తలపై కొన్ని వెంట్రుకలు ఊడిపోయాయి. అయితే మొదటిగా తనకు కేన్సర్ వ్యాధి ఉన్న విషయాన్ని చెప్పేందుకు వెనుకంజ వేసింది. విగ్గు వేసుకొని మోడల్ ఫొటోలు పెట్టినా చివరకు వాస్తవ చిత్రాలను ఉంచింది. కానీ నెటిజన్ల ఆమె నిర్ణయాన్ని స్వాగతించారు. ఆమెకు మరింత ఆదరణ, ఓదార్పు లభించడంతో హర్షం వ్యక్తం చేసింది. త్వరలోనే కేన్సర్‌ను పూర్తిగా జయిస్తానని ధీమా వ్యక్తం చేసింది.

ఇది కూడా చదవండి: Shocking Video: అబ్బ.. ఎంత పెద్దదో.. అంటూ బండిని ఆపి మరీ ఖడ్గ మృగాన్ని ఫొటోలు తీశారు.. అంతే మరుక్షణంలోనే ఊహించని సీన్..!

Updated Date - 2023-03-02T16:36:20+05:30 IST