Wedding: పెళ్లింట విషాదం.. క్యాటరింగ్ చేసే అబ్బాయి వేగంగా నడుస్తూ వెళ్లడంతో..

ABN , First Publish Date - 2023-05-01T17:44:26+05:30 IST

అతడో కాలేజీ స్టూడెంట్. పేరు వీ సతీష్. వయసు 21 సంవత్సరాలు. తల్లిదండ్రులు రోజు కూలీలు. కుటుంబ ఆర్థిక పరిస్థితి అనుకూలించకపోవడంతో చదువుకుంటూనే పార్ట్‌ టైమ్‌గా ఓ క్యాటరింగ్‌ కంపెనీలో పనిచేస్తుండేవాడు. కానీ...

Wedding: పెళ్లింట విషాదం.. క్యాటరింగ్ చేసే అబ్బాయి వేగంగా నడుస్తూ వెళ్లడంతో..

తిరువళ్లూరు: అతడో కాలేజీ స్టూడెంట్. పేరు వీ సతీష్. వయసు 21 సంవత్సరాలు. తల్లిదండ్రులు రోజు కూలీలు. కుటుంబ ఆర్థిక పరిస్థితి అనుకూలించకపోవడంతో చదువుకుంటూనే పార్ట్‌ టైమ్‌గా ఓ క్యాటరింగ్‌ కంపెనీలో (భోజనాలు వడ్డింపు) పనిచేస్తుండేవాడు. చదువుకయ్యే ఖర్చును తానే సొంతంగా సంపాదించుకునేవాడు. ఎప్పటిలాగానే గతవారం జరిగిన ఓ పెళ్లిలో కేటరింగ్‌కు వెళ్లాడు. విందు మొదలయ్యింది. అయితే భోజనాలు వడ్డించే క్రమంలో సతీష్ ప్రమాదవశాత్తూ జారి వేడివేడి రసం సాంబారు గుండిగలో (cauldron) పడ్డాడు. వడ్డీ క్రమంలో వేగంగా నడుస్తూ రసం సాంబారు గుండిగ వైపు వెళ్తూ పట్టుతప్పి పడిపోయాడని తెలుస్తోంది.

రసం సలసలా మరుగుతుండడంతో సతీష్ ఒళ్లంతా తీవ్రంగా కాలింది. బయటకు తీసి హూటాహుటిన ఘటన జరిగిన మింజుర్ టౌన్‌లోని (Minjur) ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అనంతరం అక్కడి నుంచి కిలాపాక్ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌కు తరలించారు. తీవ్రమైన కాలిన గాయాలకు అక్కడ చికిత్స జరిగినా ఫలితం దక్కలేదు. సతీష్ చికిత్సకు స్పందించలేదు. ఆదివారం చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. విషాదకరమైన ఈ ఘటన తమిళనాడులోని తిరువళ్లూరులో జరిగింది. ఈ ఘటనపై సీఆర్‌పీసీ సెక్షన్ 174 కింద కేసు నమోదయ్యిందని, దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశామని తెలిపారు. కాగా భోజనాలు వడ్డించే క్రమంలో వేగంగా నడుస్తూ రసం సాంబారు గుండిక వైపు సతీష్ వెళ్లాడని పెళ్లికి వచ్చిన అతిథులు వెల్లడించారు. పెళ్లింట జరిగిన ఈ ఘటనపై షాక్‌కు గురయ్యామని తెలిపారు.

ఇవి కూడా చదవండి...

tuni train incident: సంచలన కేసులో విజయవాడ రైల్వే కోర్ట్ తీర్పు.. ముద్రగడ పద్మనాభం, మంత్రి దాడిశెట్టి రాజాలపై కేసు కొట్టివేత

SBI Amrit Kalash: ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త.. ఆ స్కీమ్‌ను మళ్లీ ప్రవేశపెట్టిన బ్యాంక్..

Updated Date - 2023-05-01T17:44:26+05:30 IST