Zomato CEO Weight Loss: మారిపోయిన జొమాటో సీఈవో లుక్.. ఏకంగా 15 కేజీల బరువు ఎలా తగ్గాడో చెప్పేశారుగా..!

ABN , First Publish Date - 2023-08-02T15:32:31+05:30 IST

ఇటీవలి కాలంలో చాలామందికి ఆరోగ్య స్పృహ పెరుగుతోంది. రక్తపోటు, మధుమేహం వంటి లైఫ్‌స్టైల్ రోగాలు పెరిగిపోతుండడంతో చాలా మంది తమ ఆరోగ్యంపై దృష్టి పెడుతున్నారు. బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Zomato CEO Weight Loss: మారిపోయిన జొమాటో సీఈవో లుక్.. ఏకంగా 15 కేజీల బరువు ఎలా తగ్గాడో చెప్పేశారుగా..!

ఇటీవలి కాలంలో చాలామందికి ఆరోగ్య (Health) స్పృహ పెరుగుతోంది. రక్తపోటు (BP), మధుమేహం (Diabetis) వంటి లైఫ్‌స్టైల్ రోగాలు పెరిగిపోతుండడంతో చాలా మంది తమ ఆరోగ్యంపై దృష్టి పెడుతున్నారు. బరువు (Weight loss) తగ్గేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు (Dieting). క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నారు. జొమాటో సీఈవో దీపీందర్ గోయల్ (Zomato CEO) కూడా బరువు తగ్గడంపై దృష్టి సారించి మంచి ఫలితం పొందారట. నాలుగు సంవత్సరాల్లో ఆరోగ్యకరంగా 15 కేజీలు తగ్గారట.

లాక్‌డౌన్ సమయంలో దీపీందర్ (Deepinder Goyal) తన ఫిట్‌నెస్‌పై ద‌ృష్టి సారించారట. తన ఆహారపు అలవాట్లను పూర్తిగా మార్చుకున్నారట. ఆయన తన ఫిట్‌నెస్ జర్నీ (Fitness journery)ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. 2019 vs 2023 అంటూ పాత, కొత్త ఫొటోలనూ, అప్పటి, ఇప్పటి బరువు, కొలస్ట్రాల్ స్థాయిలు రాసి ఉన్న నోట్‌లను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ``2017లో నా ఫిట్‌నెస్ జర్నీ స్టార్ట్ చేశా. బిజినెస్‌తో పాటు ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యం ఇవ్వడం మొదలుపెట్టా. దేనినీ అతిగా చేయలేదు. స్టార్ట్ చేసిన ఏ పనినీ మధ్యలో ఆపలేదు. ఇవిగో ఫలితాలు`` అంటూ దీపీందర్ పేర్కొన్నారు (Zomato CEO Weight Loss).

Viral: ఈ ఫొటోలోని పాప నెలకు కోటి రూపాయలు సంపాదిస్తోంది.. నిండా 12 ఏళ్ల వయసు కూడా లేదు.. అప్పుడే రిటైర్మెంట్..!

2019లో దీపీందర్ 87 కిలోల బరువు ఉండేవారు. ప్రస్తుతం ఆయన బరువు 72 కిలోలకు చేరుకుంది. ``కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారం తక్కువగా తీసుకునేవాడిని. క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవాడిని. వీకెండ్స్‌లో ఒకటి లేదా రెండు రోజులు మాత్రం గులాబ్ జామూన్, చికెన్ తినేవాడిని. గతంలోని ఆహార అలవాట్లను వదిలించుకుంటూ ప్రతి వారం మెరుగయ్యేవాడిని. వ్యాయామం, డైటింగ్ కచ్చితంగా పాటిస్తూ శారీరకంగా, మానసికంగా సానుకూల ఫలితాలు సాధించాన``ని గోయల్ తెలిపారు.

Updated Date - 2023-08-02T15:48:16+05:30 IST