Viral video: ఫుడ్ డెలివరీ బాయ్స్ కష్టాలు ఎలా ఉంటాయో ఈ ఒక్క వీడియో చూస్తే చాలు.. ఒకతను ఏం చేశాడో మీరే చూడండి
ABN , First Publish Date - 2023-06-28T20:26:38+05:30 IST
ఫుడ్ డెలివరీ బాయ్స్ ఎండ, వాన, చలి ఇవేమీ లెక్కచేయక ఆహారాన్ని పదిలంగా తీసుకొచ్చి వెళ్లిపోతుంటారు. పనికి తగ్గట్టు చెల్లింపు ఉండదనే వాదన ఉన్నప్పటికీ అవేమీ పట్టించుకోకుండా కష్టపడి కడుపు నింపుకుంటుంటారు. బతుకుదెరువు కోసం చెమటోడ్చుతుంటారు. ఈ సత్యాన్ని నిరూపించే వీడియో ఒకటి వెలుగుచూసింది.
ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ ఇవ్వడం, నిమిషాల వ్యవధిలోనే అది డెలివరీ కావడం, రుచికరమైన ఆహారంతో ఆకలి తీర్చుకోవడం చాలా సులభంగా జరిగిపోతుంటాయి. నచ్చిన రెస్టారెంట్ లేదా హోటల్ నుంచి ఇంటి గుమ్మం ముందుకు ఫుడ్‌ని తెప్పించుకోవడం చాలా తేలిక. కానీ ఇంత సులభంగా ఫుడ్ డెలివరీ ఎందరిదో కష్టం ఉంటుంది. ముఖ్యంగా ఫుడ్ డెలివరీ బాయ్స్ శ్రమకు ఓర్చి ఆహారాన్ని చేరవేస్తుంటారు. ఎండ, వాన, చలి ఇవేమీ లెక్కచేయక ఆహారాన్ని పదిలంగా అందించి వెళ్లిపోతుంటారు. వీరికి పనికి తగ్గట్టు చెల్లింపు ఉండదనే వాదన ఉన్నప్పటికీ అవేమీ పట్టించుకోకుండా చెమటోడ్చి కడుపు నింపుకుంటుంటారు. ఈ సత్యాన్ని నిరూపించే వీడియో ఒకటి వెలుగుచూసింది.
ప్లాస్టిక్ కవర్‌లో అన్నం తింటూ ఓ జొమాటో డెలివరీ బాయ్ (Zomato delivery) కెమెరా కంటికి చిక్కాడు. ఐఏఎస్ ఆఫీసర్ అవనిష్ శరణ్ ట్విటర్‌లో షేర్ చేసిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ‘సంక్లిష్టమైన పరిస్థితుల్లో పనిచేస్తున్న ఇలాంటి వర్కర్ల పట్ల జాగ్రత్త తీసుకోండి’’ అని ఆయన క్యాప్షన్ ఇచ్చారు. 20 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో క్లిప్‌ను ఇప్పటికే 313K మంది వీక్షించగా 9.8K లైక్స్ వచ్చాయి. ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
జోమాటోకు చెందిన ఈ డెలివరీ పార్టనర్ ఒక డెలివరీ తర్వాత లంచ్ బ్రేక్ తీసుకున్నట్టుగా అనిపిస్తోంది. కుదురుగా కూర్చొని తినకుండా.. కవర్‌లో ఉన్న అన్నాన్ని బైక్ మీద పెట్టుకుని నిలబడి హడావుడిగా తింటూ కనిపించాడు. తర్వాతి డెలివరీ అందించడానికో ఏమో అన్నట్టుగా కంగారుకంగారుగా తినేశాడు.
అందరికీ రుచికరమైన ఆహారాలు తెచ్చిపెట్టే ఒక డెలివరీ బాయ్ ఈ విధంగా ప్లాస్టిక్ కవర్‌లో ఆహారాన్ని తినడం చూసిన నెటిజన్లు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఫుడ్ డెలివరీ వర్కర్లు ఎంతో గౌరవం ఇవ్వాల్సిన వ్యక్తులని అనేకమంది కామెంట్ చేస్తున్నారు. ‘‘ వీళ్లు కనీసం ప్రశాంతంగా తినలేకపోవడం చూస్తుంటే గుండెతరుక్కుపోతోంది’’ అని ఓ యూజర్ పేర్కొన్నాడు. ఇబ్బందికరమైన వాతావరణంలో ఇంటి గుమ్మం ముందుకు వచ్చే ఇలాంటి డెలివరీ బాయ్స్‌కి చిరుసాయం చేయండి అంటూ ఓ నెటిజన్ సందేశమిచ్చాడు. మరో వ్యక్తి స్పందిస్తూ.. నేనైతే ఏదో ఒక సాయం చేస్తుంటా అని చెప్పాడు. మొత్తంగా ఈ వీడియో ప్రతిఒక్కరినీ కదిలిస్తోంది. రెండు నిమిషాలు ఆలస్యమైతే చాలు డెలివరీ బాయ్స్ మీద కస్సుబుస్సు లాడే వారు ఈ వీడయో చూసైనా వారి పరిస్థితులు అర్థం చేసుకుంటే బావుంటుంది.