Chennai Vs Rajasthan: కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. సమవుజ్జీల సమరం!
ABN , First Publish Date - 2023-04-12T19:11:06+05:30 IST
ఐపీఎల్ 2023లో (IPL2023) మరో రసవత్తర పోరుకు తెరలేచింది. ఈ సీజన్‌లో 17వ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోని సారధ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్, సంజూ శాంసన్ నాయకత్వంలోని రాజస్థాన్ రాయల్స్ (Chennai Super Kings vs Rajasthan Royals) తలపడుతున్నాయి.
![Chennai Vs Rajasthan: కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. సమవుజ్జీల సమరం!](https://media.andhrajyothy.com/media/2023/20230317/Untitled_9_c7b23ea2de.jpg)
చెన్నై: ఐపీఎల్ 2023లో (IPL2023) మరో రసవత్తర పోరుకు తెరలేచింది. ఈ సీజన్‌లో 17వ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోని సారధ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్, సంజూ శాంసన్ నాయకత్వంలోని రాజస్థాన్ రాయల్స్ (Chennai Super Kings vs Rajasthan Royals) తలపడుతున్నాయి. టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ ధోని (MS Dhoni) బౌలింగ్ ఎంచుకున్నాడు. ప్రత్యర్థి రాజస్థాన్ రాయల్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. కాగా ఈ మ్యాచ్‌తో ఐపీఎల్‌లో 200వ మ్యాచ్‌కు ధోని కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. కాగా చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది.
తుది జట్లు..
రాజస్థాన్ రాయల్స్: యశశ్వి జైస్వాల్, జాస్ బట్లర్, సంజూశాంసన్(కెప్టెన్/వికెట్ కీపర్), దేవధూత్ పడిక్కల్, హిట్మేయర్, ద్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, జాసన్ హోల్డర్, కుల్దీప్ సేన్, సందీప్ శర్మ, యజువేంద్ర చాహల్.
చెన్నై సూపర్ కింగ్స్: దెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే, మొయిన్ అలీ, శివం దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ(కెప్టెన్/వికెట్ కీపర్), సిసంద మంగళ, మహీష్ తీక్షణ, తుషార్ దేశ్‌పాండే, ఆకాశ్ సింగ్.
కాగా ఈ సీజన్‌లో ఇరు జట్లు ఇప్పటివరకు మూడు చొప్పున మ్యాచ్‌లు ఆడగా.. చెరో రెండు గెలుపులతో సమఉజ్జీలుగా ఉన్నాయి. ఈ రోజు విజయం సాధించే జట్టు మూడో విజయాన్ని సొంతం చేసుకోనుంది. మరి ఏ జట్టుని విజయం వరించబోతుందో తెలియాలంటే కొన్ని గంటలు వేచిచూడాల్సిందే.