Vishakapatnam T20: సెంచరీ బాదిన జాష్ ఇంగ్లీస్.. టీమిండియా ముందు భారీ టార్గెట్
ABN , First Publish Date - 2023-11-23T20:57:42+05:30 IST
IND Vs AUS: విశాఖ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టీ20లో ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా బ్యాటర్లు వీరవిహారం చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆస్ట్రేలియా 3 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది.
విశాఖ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టీ20లో ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా బ్యాటర్లు వీరవిహారం చేశారు. ముఖ్యంగా ప్రపంచకప్‌లో అంతగా రాణించని జాష్ ఇంగ్లీస్ ఈ మ్యాచ్‌లో రెచ్చిపోయాడు. 50 బాల్స్‌లో 11 ఫోర్లు, 8 సిక్సర్లతో 110 రన్స్ చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఇంగ్లీస్‌కు ఇదే అత్యుత్తమ స్కోరు. అతడికి స్టీవ్ స్మిత్ (52) మంచి సహకారం అందించాడు. మాథ్యూ షార్ట్ (13) విఫలమైనా రెండో వికెట్‌కు స్మిత్-ఇంగ్లీస్ 130 పరుగుల భారీ భాగస్వామ్యం అందించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. సూర్యకుమార్ సేన ముందు 209 పరుగుల భారీ టార్గెట్ నిలిచింది. టీమిండియా బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ, రవి బిష్ణోయ్ తలో వికెట్ పడగొట్టారు. స్మిత్ రనౌట్‌గా పెవిలియన్ చేరాడు. ఈ సిరీస్‌కు సీనియర్లు దూరంగా ఉండగా.. సూర్యకుమార్ కెప్టెన్సీ వహిస్తున్నాడు. గతంలో అతడికి ముంబై ఇండియన్స్ తరఫున నాయకత్వం వహించిన అనుభవం ఉంది. ఇప్పటివరకు 17 మ్యాచ్‌లకు కెప్టెన్సీ చేసిన సూర్యకుమార్ 11 మ్యాచ్‌లను గెలిపించగా ఆరు మ్యాచ్‌లలో మాత్రం ఓటమి చవిచూశాడు.
మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.