Asia Cup 2023: పాపం ఆప్ఘనిస్తాన్.. అతడు డిఫెన్స్ ఆడటం వల్లే ఓడిపోయిందా?
ABN , First Publish Date - 2023-09-06T16:12:06+05:30 IST
సూపర్-4కు వెళ్లాలంటే శ్రీలంక విధించిన 292 పరుగుల టార్గెట్‌ను ఆప్ఘనిస్తాన్ 37.4 ఓవర్లలో ఛేదించాలి. ఈ లెక్కను దృష్టిలో పెట్టుకునే ఆప్ఘనిస్తాన్ వేగంగా ఆడేందుకు ప్రయత్నించింది. కానీ ఫారుఖీ చేసిన పనితో ఆ జట్టు అభిమానులు నిరాశ చెందారు. అతడు డిఫెన్స్ ఆడేందుకు మాత్రమే ప్రయత్నించాడు. భారీ షాట్లు కాదు కదా కనీసం సింగిల్ తీయడానికి కూడా ప్రయత్నించలేదు. చివరకు 38వ ఓవర్ నాలుగో బంతికి ఫారుఖీ అవుట్ కావడంతో ఆప్ఘనిస్తాన్ ఆలౌటైంది.
ఆసియా కప్‌లో సూపర్-4 దశకు అర్హత సాధించడానికి ఆప్ఘనిస్తాన్ శతవిధాలా ప్రయత్నించింది. అయితే ఒక్కడు చేసి తప్పు వల్ల ఆ జట్టు ఆ అవకాశాన్ని కోల్పోయినట్లు కనిపిస్తోంది. శ్రీలంకతో మ్యాచ్‌లో 292 పరుగుల టార్గెట్‌ను ఒక దశలో 38 ఓవర్లలోనే టార్గెట్ ఛేదించేలా ఆప్ఘనిస్తాన్ స్కోరు దూసుకెళ్లింది. 27 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన సమయంలో ఓటమి ఖాయం అనుకున్న దశలో కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ (59), రహ్మత్ షా (45), మహ్మద్ నబీ (65) వీరోచిత పోరాటం చేశారు.
సూపర్-4కు వెళ్లాలంటే శ్రీలంక విధించిన 292 పరుగుల టార్గెట్‌ను ఆప్ఘనిస్తాన్ 37.4 ఓవర్లలో ఛేదించాలి. ఈ లెక్కను దృష్టిలో పెట్టుకునే ఆప్ఘనిస్తాన్ వేగంగా ఆడేందుకు ప్రయత్నించింది. కానీ ఓపెనర్లు రహ్మనుల్లా గుర్భాజ్ (4), ఇబ్రహీం జార్డాన్ (7) దారుణంగా విఫలమయ్యారు. వీళ్లిద్దరినీ శ్రీలంక బౌలర్ రజిత పెవిలియన్‌కు పంపాడు. కానీ రహ్మత్ షా ఎంట్రీతో మ్యాచ్ స్వరూపం మారిపోయింది. అతడికి కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ జత కలవడంతో స్కోరు వేగంగా దూసుకెళ్లింది. దీంతో ఆప్ఘనిస్తాన్ విజయానికి చేరువగా వెళ్లింది. కానీ శ్రీలంక బౌలర్లు సరైన సమయంలో విజృంభించి వరుసగా వికెట్లు సాధించడంతో ఆప్ఘనిస్తాన్ ఒత్తిడిలో పడింది. 38వ ఓవర్‌లో ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్ క్రీజులో ఉండటంతో ఆప్ఘనిస్తాన్ విజయం సాధిస్తుందని అభిమానులు విశ్వసించారు.
ఇది కూడా చదవండి: ODI World Cup 2023: ప్రపంచకప్‌కు జట్టు ప్రకటన.. కానీ ఇంతలోనే ఫ్యాన్స్‌కు బిగ్ షాక్!
38వ ఓవర్‌ను శ్రీలంక బౌలర్ సమర విక్రమ బౌలింగ్ చేశాడు. క్రీజులో ముజీబ్, రషీద్ ఖాన్ ఉన్నారు. అయితే తొలి బంతికే ముజీబ్ అవుట్ అయ్యాడు. ఆ సమయంలో ఫజల్లా ఫారుఖీ క్రీజులోకి వచ్చాడు. అతడు సింగిల్ తీసి రషీద్ ఖాన్‌కు ఇచ్చి ఉంటే ఆప్ఘనిస్తాన్ గెలిచి ఉండేది. కానీ ఫారుఖీ చేసిన పనితో ఆ జట్టు అభిమానులు నిరాశ చెందారు. అతడు డిఫెన్స్ ఆడేందుకు మాత్రమే ప్రయత్నించాడు. భారీ షాట్లు కాదు కదా కనీసం సింగిల్ తీయడానికి కూడా ప్రయత్నించలేదు. చివరకు 38వ ఓవర్ నాలుగో బంతికి ఫారుఖీ అవుట్ కావడంతో ఆప్ఘనిస్తాన్ ఆలౌటైంది. దీంతో రెండు పరుగుల తేడాతో ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఫజల్లా ఫారుఖీ డిఫెన్స్ ఆడటం వల్లే ఆప్ఘనిస్తాన్ ఓడిపోయిందని సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. ఒకవేళ ఆప్ఘనిస్తాన్ 37.5 ఓవర్లలో టార్గెట్‌ను చేరుకుని ఉంటే బంగ్లాదేశ్ స్థానంలో సూపర్-4లోకి అడుగుపెట్టేది.