Arjun Tendulkar: తొలి మ్యాచ్‌తోనే రికార్డులకెక్కిన అర్జున్ టెండూల్కర్.. ఐపీఎల్‌లో ఇదో ఘనత!
ABN , First Publish Date - 2023-04-16T20:42:44+05:30 IST
కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (MI) 5 వికెట్ల తేడాతో విజయం
ముంబై: కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (MI) 5 వికెట్ల తేడాతో విజయం సాధించి ఐపీఎల్(IPL 2023)లో రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌తో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసి కల నెరవేర్చుకున్న క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) తనయుడు అర్జున్ టెండూల్కర్ (Arjun Tendulkar) అరుదైన ఘనత సాధించాడు. అన్‌క్యాప్‌డ్ ఇండియన్ ప్లేయర్ అయిన అర్జున్ టెండూల్కర్‌ను ముంబై ఇండియన్స్ 2021లో కనీస ధరకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత రెండేళ్లపాటు ఎదురుచూసిన అర్జున్ ఎట్టకేలకు కోల్‌కతాతో మ్యాచ్‌లో ఐపీఎల్‌లో అడుగు మోపాడు.
ఈ మ్యాచ్‌లో తొలి ఓవర్ వేసిన అర్జున్ పొదుపుగానే పరుగులు ఇచ్చాడు. అయితే, రెండో ఓవర్‌లో కాస్తన్ని ఎక్కువ పరుగులు సమర్పించుకున్నాడు. రెండు ఓవర్లు మాత్రమే వేసిన జూనియర్ టెండూల్కర్ 17 పరుగులు ఇచ్చాడు. ఐపీఎల్‌లో నిజానికి బెస్ట్ ఫిగర్సే. అర్జున్ మైదానంలో అడుగుపెడుతూనే అత్యంత అరుదైన రికార్డును తనపేర రాసుకున్నాడు. తండ్రి తర్వాత కుమారుడు కూడా అదే ఫ్రాంచైజీకి ఆడడం ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి. ఒకే ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించిన తండ్రీ కొడుకులుగా సచిన్, అర్జున్ రికార్డులకెక్కారు.