Hardik Pandya: ఆ ఘనత సాధించిన అతి పిన్న క్రికెటర్‌గా పాండ్యా.. అదేంటంటే?
ABN , First Publish Date - 2023-03-07T18:37:10+05:30 IST
టీమిండియా ఆల్‌రౌండర్, భారత టీ20 జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా
న్యూఢిల్లీ: టీమిండియా ఆల్‌రౌండర్, భారత టీ20 జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) అత్యంత అరుదైన ఘనత సాధించాడు. ఆస్ట్రేలియా(Australia)తో జరుగుతున్న టెస్టు సిరీస్ నుంచి దూరంగా ఉన్న పాండ్యా ఆ జట్టుతో ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌లో మళ్లీ బ్యాట్ పట్టనున్నాడు.
సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే పాండ్యా తాజాగా అత్యంత అరుదైన ఘనత సాధించాడు. ఇన్‌స్టాగ్రామ్(Instagram)లో ఇప్పుడతడి ఫాలోవర్ల సంఖ్య 25 మిలియన్లు దాటిపోయింది. ఫలితంగా ప్రపంచంలోనే ఆ ఘనత సాధించిన అతిపిన్న వయస్కుడైన క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో గ్లోబల్ టెన్నిస్ స్టార్లు రఫెల్ నాదల్, ఫెదరర్, డచ్ రేసింగ్ డ్రైవర్ మాక్స్ వెర్‌స్టాపెన్ వంటి వారిని వెనక్కి నెట్టేశాడు. కాగా, ఇన్‌స్టాగ్రామ్‌లో నాదల్‌కు 17.9 మిలియన్లు, వెర్‌స్టాపెన్‌కు 9.5 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.
ఇన్‌స్టాలో 25 మిలియన్ల మందికిపైగా ఫాలోవర్లను సొంతం చేసుకున్న పాండ్యా ఈ సందర్భంగా అభిమానులకు కృతజ్ఞతలు చెబుతూ ఓ పోస్టును షేర్ చేశాడు. తనపై ప్రేమాభిమానాలు చూపిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నాడు.
టీమిండియా క్రికెటర్లలో ఎవరికి ఎంతమంది?
టీమిండియా క్రికెటర్లలో విరాట్ కోహ్లీకి 239 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండగా రోహిత్ శర్మకు 26.9, కేఎల్ రాహుల్‌కు 13.8, జస్ప్రీత్ బుమ్రాకు 10.2, రిషభ్ పంత్‌కు 7.7 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీకి 40.7 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇప్పుడు హార్దిక్ పాండ్యా 25 మిలియన్ల మందికిపైగా ఫాలోవర్లతో ఆ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడైన క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు.