Irfan Pathan: ఆ ‘కేజీఎఫ్’ కాకుండా ఇంకెవరున్నారో చూసుకోవాలి.. కార్తీక్ ఒక్కసారి కూడా..
ABN , First Publish Date - 2023-05-01T18:37:01+05:30 IST
ఈ సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) పడుతూ లేస్తూ ఉంది. ఇప్పటి వరకు
బెంగళూరు: ఈ సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) పడుతూ లేస్తూ ఉంది. ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడిన బెంగళూరు నాలుగింటిలో విజయం సాధించి.. అన్నే మ్యాచుల్లో ఓడింది. ఈ నేపథ్యంలో నేడు లక్నో సూపర్ జెయింట్స్ (LSG) తో జరగనున్న మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా పాయింట్ల పట్టికలో పైకి ఎగబాకాలని చూస్తోంది. వరుస పరాజయాలతో నేటి మ్యాచ్ ఆడబోతున్న డుప్లెసిస్ (Duplessis) సేన లక్నోను ఎలా అడ్డుకుంటుందో చూడాలి.
ఆర్సీబీ తాజా పరిస్థితిపై టీమిండియా మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ జట్టు ‘కేజీఎఫ్’ (కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఫా డుప్లెసిస్) పైనే ఆధారపడడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్నాడు. ఆ జట్టులోని ఇండియన్ ప్లేయర్లు బ్యాట్‌తో ప్రభావం చూపలేకపోతున్నారని, ఇది ఆందోళన కలిగిస్తోందని వివరించాడు.
జట్టులోని ఆ ముగ్గురు (కేజీఎఫ్) కనుక విఫలమైతే పరిస్థితి ఏంటన్న దానిపై ఆర్సీబీ ఆలోచించాలని ఇర్ఫాన్ సూచించాడు. వారు ముగ్గురు ఆడని పక్షంలో జట్టును గట్టెక్కించేది ఎవరన్నాడు. అది దినేశ్ కార్తీకా? లేదంటే మహిపాల్ లోమ్రోరా? అని నిలదీశాడు. నిజం చెప్పాలంటే ఆర్సీబీ మిడిలార్డర్ చాలా వీక్‌గా ఉందన్నాడు. లక్ష్య ఛేదనలో లేదంటే జట్టు భారీ స్కోరు చేయడంలో పనికొస్తాడని జట్టు బాగా ఆధారపడిన కార్తీక్ గత 8 మ్యాచుల్లో ఒక్కసారి కూడా తనను తాను నిరూపించుకోలేకపోయాడని పటాన్ పేర్కొన్నాడు. బ్యాటింగ్ విషయంలో ఉన్న లొసుగులను ఆర్సీబీ సరిదిద్దుకోవాలని సూచించాడు.