Share News

Lucknow Super Gaints: అవేష్‌ఖాన్ అవుట్.. దేవదత్ పడిక్కల్ ఇన్..!!

ABN , First Publish Date - 2023-11-23T15:44:39+05:30 IST

IPL 2024: లక్నో సూపర్ జెయింట్స్ వచ్చే సీజన్‌లో ఛాంపియన్‌గా నిలవాలని ఉవ్విళ్లూరుతోంది. దీంతో తమ జట్టును ప్రక్షాళన చేయాలని నిర్ణయించింది. ఈ ఏడాది ఐపీఎల్‌లో రాణించని పేసర్ అవేష్‌ఖాన్‌ను వదులుకోవాలని భావించింది. ఈ మేరకు ఆటగాళ్ల ట్రేడింగ్ విండో ద్వారా తమ జట్టు ఆటగాడు అవేష్‌ఖాన్‌ను వదులుకుని రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు దేవదత్ పడిక్కల్‌ను తీసుకుంటున్నట్లు లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.

Lucknow Super Gaints: అవేష్‌ఖాన్ అవుట్.. దేవదత్ పడిక్కల్ ఇన్..!!

ఐపీఎల్ వేలం దగ్గర పడుతుండటంతో అన్ని జట్లు తమ ఆటగాళ్ల బలాబలాలపై దృష్టి సారించాయి. డిసెంబరులో ఐపీఎల్ వేలం జరగనున్న నేపథ్యంలో గత రెండు సీజన్‌లలో ప్లే ఆఫ్స్‌కు వెళ్లిన లక్నో సూపర్ జెయింట్స్ వచ్చే సీజన్‌లో ఛాంపియన్‌గా నిలవాలని ఉవ్విళ్లూరుతోంది. దీంతో తమ జట్టును ప్రక్షాళన చేయాలని నిర్ణయించింది. ఈ ఏడాది ఐపీఎల్‌లో రాణించని పేసర్ అవేష్‌ఖాన్‌ను వదులుకోవాలని భావించింది. ఈ మేరకు ఆటగాళ్ల ట్రేడింగ్ విండో ద్వారా తమ జట్టు ఆటగాడు అవేష్‌ఖాన్‌ను వదులుకుని రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు దేవదత్ పడిక్కల్‌ను తీసుకుంటున్నట్లు లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఇప్పటికే టీమ్ మెంటార్ గౌతమ్ గంభీర్‌ను కూడా వదులుకున్న లక్నో టీమ్.. ఇప్పుడు అవేష్ ఖాన్‌ను కూడా వదులుకుని తమ లక్ష్యం ఏంటో ప్రత్యర్థులకు చాటిచెప్తోంది. అయితే గంభీర్ స్థానంలో కొత్త మెంటార్‌ నియామకంపై లక్నో సూపర్ జెయింట్స్ ఎలాంటి ప్రకటన చేయలేదు.

అయితే తాజా సమాచారం మేరకు లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌గా టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్‌ను నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. గత సీజన్‌లో హెడ్ కోచ్‌ను మార్చిన లక్నో యాజమాన్యం వచ్చే సీజన్ కోసం మెంటార్‌ను మార్చడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గత సీజన్‌లో ఆండీ ఫ్లవర్ స్థానంలో జస్టిన్ లాంగర్‌ను లక్నో సూపర్ జెయింట్స్ హెడ్ కోచ్‌గా నియమించింది. అయినా ప్లే ఆఫ్స్‌లోనే ఆ జట్టు వెనుతిరిగింది. వచ్చే సీజన్ విదేశాల్లో జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే స్వదేశంలో మార్చి, ఏప్రిల్ నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో ఐపీఎల్ పాలక మండలి మెగా టీ20 లీగ్‌ను విదేశాల్లో నిర్వహించే అవకాశాలు ఉన్నాయని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. స్టేడియాలలో ఆటగాళ్లకు సెక్యూరిటీ కల్పించేందుకు ఇబ్బందులు వస్తాయని.. అందువల్ల దుబాయ్ లేదా శ్రీలంకలో ఐపీఎల్-2024 నిర్వహించవచ్చని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-23T15:44:51+05:30 IST