IPL 2024: పాండ్యా కోసం రూ.17.5 కోట్ల ఆటగాడిని వదులుకున్న ముంబై ఇండియన్స్
ABN , First Publish Date - 2023-11-25T15:14:03+05:30 IST
IPL 2024: ముంబై ఇండియన్స్ తాజాగా రిలీజ్ ఆటగాళ్ల జాబితాను ప్రకటించింది. ఈ సందర్భంగా సంచలన నిర్ణయం తీసుకుంది. వేలంలో రూ.17.5 కోట్లతో కొనుగోలు చేసిన కామెరూన్ గ్రీన్‌ను రిలీజ్ చేసింది.
ఐపీఎల్ 2024 కోసం అన్ని ఫ్రాంచైజీలో తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. ఆదివారంతో ట్రేడింగ్ విండో, ఆటగాళ్ల రిటెన్షన్ జాబితా సమర్పించే గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రానికల్లా అన్ని ఫ్రాంచైజీలు రిటైన్, రిలీజ్ ఆటగాళ్ల జాబితాలను సమర్పించాలి. దీంతో ముంబై ఇండియన్స్ తాజాగా రిలీజ్ ఆటగాళ్ల జాబితాను ప్రకటించింది. ఈ సందర్భంగా సంచలన నిర్ణయం తీసుకుంది. వేలంలో రూ.17.5 కోట్లతో కొనుగోలు చేసిన కామెరూన్ గ్రీన్‌ను రిలీజ్ చేసింది. అతడితో పాటే జోఫ్రా ఆర్చర్ (రూ.8 కోట్లు), క్రిస్ జోర్డాన్ (రూ.50 లక్షలు), డి.జాన్సన్ (రూ.20 లక్షలు), ట్రిస్టాన్ స్టబ్స్ (రూ.20 లక్షలు), అర్షద్ ఖాన్ (రూ.20 లక్షలు) రిలీజ్ చేస్తున్నట్లు ముంబై ఇండియన్స్ ప్రకటించింది. వీళ్ల స్థానంలో సత్తా ఉన్న ఆటగాళ్లను కొనుగోలు చేయాలని ముంబై ఇండియన్స్ నిర్ణయించుకుంది.
మరోవైపు గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యాను తీసుకునేందుకు రూ.15 కోట్లకు ముంబై ఇండియన్స్ డీల్ కుదుర్చుకుందని సమాచారం అందుతోంది. త్వరలో రోహిత్ శర్మ రిటైర్ కానుండటంతో అతడు వెళ్లిపోయేలోపు పాండ్యాను భవిష్యత్ కెప్టెన్‌గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో అతడిని తీసుకోవాలని ముంబై నిర్ణయించుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే కామెరూన్ గ్రీన్ స్థానాన్ని పాండ్యాతో భర్తీ చేయనుంది. ప్రస్తుతం గ్రీన్, ఆర్చర్‌ను రిలీజ్ చేయడంతో ముంబై పర్సులో రూ.25.5 కోట్లు ఉంటాయి. వీటిలో రూ.15 కోట్లు పాండ్యాకు చెల్లించినా.. మిగతా రూ.10 కోట్లతో డిసెంబర్ 19న జరిగే మినీ వేలంలో సత్తా ఉన్న ఆటగాళ్లను కొనుగోలు చేయాలని ముంబై భావిస్తోంది.
మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.