Asia Cup 2023: పాపం పాకిస్థాన్.. సొంతగడ్డపై ఒకే ఒక్క మ్యాచ్

ABN , First Publish Date - 2023-07-12T16:15:51+05:30 IST

దక్షిణాఫ్రికాలోని డర్బన్ వేదికగా మంగళవారం ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ కమిటీ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆసియా కప్ షెడ్యూల్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే షెడ్యూల్‌పై అధికారిక ప్రకటన రానుంది. ఈ శుక్రవారం షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.

 Asia Cup 2023: పాపం పాకిస్థాన్.. సొంతగడ్డపై ఒకే ఒక్క మ్యాచ్

ఈ ఏడాది కీలకమైన వన్డే ప్రపంచకప్‌(ODI World cup)కు ముందు ఆసియా కప్ (Asia Cup 2023) జరగనుంది. అయితే షెడ్యూల్ ప్రకారం ఆసియా కప్ పాకిస్థాన్ గడ్డపై జరగాలి. కానీ పాకిస్థాన్‌లో ఆసియా కప్ నిర్వహిస్తే పాల్గొనేది లేదంటూ టీమిండియా (Team India) తేల్చి చెప్పడంతో ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది. హైబ్రిడ్ మోడల్‌లో ఆసియా కప్‌ను పాకిస్థాన్, శ్రీలంకలో నిర్వహించాలని నిర్ణయించింది. ఆగస్టు 31 నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్ 50 ఓవర్ల ఫార్మాట్‌లో జరగనుంది. సెప్టెంబర్ 17న ఫైనల్ నిర్వహించనున్నారు.

దక్షిణాఫ్రికాలోని డర్బన్ వేదికగా మంగళవారం ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ కమిటీ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆసియా కప్ షెడ్యూల్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే షెడ్యూల్‌పై అధికారిక ప్రకటన రానుంది. ఈ శుక్రవారం షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఆసియా కప్‌లో మొత్తం 13 లీగ్ మ్యాచ్‌లు ఉండనున్నాయి. వీటిలో నాలుగు మ్యాచ్‌లు మాత్రమే పాకిస్థాన్‌లో జరుగుతాయని.. మిగతా మ్యాచ్‌లు శ్రీలంకలో జరగనున్నట్లు తెలుస్తోంది. నాలుగు మ్యాచ్‌ల్లో సొంతగడ్డపై పాకిస్థాన్ మ్యాచ్ ఒక్కటే ఉన్నట్లు సమాచారం. ఈ మ్యాచ్‌లో లాహోర్ వేదికగా నేపాల్‌తో పాకిస్థాన్ తలపడనుంది. మిగతా మ్యాచ్‌ల్లో ఆప్ఘనిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్, బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక, శ్రీలంక వర్సెస్ ఆప్ఘనిస్తాన్ ఉన్నాయి. టీమిండియా ఆడే మ్యాచ్‌లన్నీ శ్రీలంక వేదికగానే జరగనున్నాయి.

ఇది కూడా చదవండి: Hanuma Vihari: మళ్లీ సత్తా చాటుతా.. జట్టులోకి వస్తా..!!

ఆసియా కప్‌లో మొత్తం ఆరు జట్లు పాల్గొననున్నాయి. భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, ఆప్ఘనిస్తాన్ రెండు జట్లుగా విడిపోయి తలపడనున్నాయి. గ్రూప్-Aలో భారత్, పాకిస్థాన్, నేపాల్ ఉండగా.. గ్రూప్-Bలో శ్రీలంక, ఆప్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ఉన్నాయి. ఆసియా కప్‌లో భారత్-పాకిస్థాన్ జట్లు రెండు సార్లు తలపడే అవకాశం ఉంది. ఫైనల్ చేరితే మూడోసారి కూడా దాయాదుల మ్యాచ్ చూసే భాగ్యం అభిమానులకు దక్కనుంది. కాగా ఆసియా కప్ కోసం టీమిండియా పాకిస్థాన్‌కు రాకపోతే తాము ప్రపంచకప్ కోసం భారత్ వెళ్లేది లేదంటూ గతంలో బీరాలు పలికిన పాకిస్థాన్ జట్టుకు ప్రస్తుత షెడ్యూల్ షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆ జట్టు సొంతగడ్డపై ఆడుతోంది ఒకే ఒక మ్యాచ్‌లోనే

Updated Date - 2023-07-12T16:48:11+05:30 IST