ODI World Cup: పాకిస్థాన్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన బీసీసీఐ మాజీ అధ్యక్షుడు గంగూలీ
ABN , First Publish Date - 2023-10-19T16:13:42+05:30 IST
బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ పాకిస్థాన్ జట్టుపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాము ఆడుతున్న సమయంలో పాకిస్థాన్ చాలా బాగా ఆడేదని.. ప్రస్తుతం వరల్డ్ కప్ ఆడుతున్న పాకిస్థాన్ జట్టు బ్యాటింగ్ అస్సలు బాగోలేదని కామెంట్ చేశాడు.
టీమిండియా గడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగిన పాకిస్థాన్ జట్టు అంచనాల మేరకు రాణించలేకపోతోంది. టీమిండియాపై మ్యాచ్ ఓడిన తర్వాత ఆ జట్టు ప్రదర్శనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ పాకిస్థాన్ జట్టుపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాము ఆడుతున్న సమయంలో పాకిస్థాన్ చాలా బాగా ఆడేదని.. ప్రస్తుతం వరల్డ్ కప్ ఆడుతున్న పాకిస్థాన్ జట్టు బ్యాటింగ్ అస్సలు బాగోలేదని కామెంట్ చేశాడు. ఇలాంటి బ్యాటింగ్‌తో ప్రపంచకప్ గెలవడం చాలా కష్టమని గంగూలీ అభిప్రాయపడ్డాడు. అంతేకాకుండా ఇప్పటి జట్టు కాస్త ఒత్తిడిని కూడా తట్టుకోలేకపోతుందని పేర్కొన్నాడు.
ఇది కూడా చదవండి: IND Vs BAN: టీమిండియాకు షాక్.. స్టార్ ఆల్‌రౌండర్‌కు గాయం..!!
మరోవైపు వన్డే ప్రపంచకప్‌లో టీమిండియాపై గంగూలీ ప్రశంసలు కురిపించాడు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతంగా రాణిస్తున్నాడని కొనియాడాడు. పాకిస్థాన్‌పై రోహిత్ ప్రదర్శన తనను ఆకట్టుకుందని గంగూలీ అన్నాడు. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు అద్భుతంగా పుంజుకుని పాకిస్థాన్‌ను కట్టడి చేశారని తెలిపాడు. ఒక దశలో పాకిస్థాన్ జట్టు సులభంగా 300 పరుగులు స్కోరు చేస్తుందని తాను భావించానని.. కానీ టీమిండియా బౌలర్లు కట్టడి చేసి పాకిస్థాన్‌ను 200 పరుగులు కూడా చేయనివ్వకపోవడం నిజంగా అద్భుతమన్నాడు. కాగా భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ కేవలం 191 పరుగులకే ఆలౌటైంది. ఆ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో రాణించి భారత్‌ను గెలిపించాడు. దీంతో వరుసగా వన్డే ప్రపంచకప్ చరిత్రలో పాకిస్థాన్‌పై వరుసగా 8వ విజయాన్ని టీమిండియా తన ఖాతాలో వేసుకుంది.