Share News

Sunil Gavaskar: టీమిండియాలో అతడు ఉంటే కథ వేరేలా ఉండేది..!!

ABN , Publish Date - Dec 27 , 2023 | 05:07 PM

Sunil Gavaskar: సెంచూరియన్ టెస్టులో టీమిండియా బ్యాటింగ్ తీరుపై మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సీనియర్ ఆటగాడు ఆజింక్యా రహానె జట్టులో ఉంటే కథ వేరేలా ఉండేదని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడిపోయినా రహానె మంచి ప్రదర్శన చేశాడని గుర్తుచేశాడు.

 Sunil Gavaskar: టీమిండియాలో అతడు ఉంటే కథ వేరేలా ఉండేది..!!

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 245 పరుగులకు ఆలౌటైంది. వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ టెస్ట్ కెరీర్‌లో 8వ సెంచరీ సాధించడంతో భారత్ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. కానీ సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అంచనాల మేరకు రాణించలేకపోయారు. ఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్ తీరుపై మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సీనియర్ ఆటగాడు ఆజింక్యా రహానె జట్టులో ఉంటే కథ వేరేలా ఉండేదని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడిపోయినా రహానె మంచి ప్రదర్శన చేశాడని గుర్తుచేశాడు. అంతేకాకుండా విదేశాల్లో రహానెకు మంచి అనుభవం ఉందని పేర్కొన్నాడు.

2018-19 పర్యటనలో జోహన్నెస్ బర్గ్ టెస్టులో రహానె గొప్పగా పోరాడాడని.. అప్పుడు కూడా తొలి రెండు టెస్టులకు అతడిని తీసుకోలేదని గవాస్కర్ తెలిపాడు. కానీ తొలి రెండు టెస్టుల్లో భారత్ ఓడిపోయిందని.. దీంతో మూడో టెస్టుకు రహానెను తీసుకోగా.. అతడు తన సత్తా నిరూపించుకున్నాడని అన్నాడు. తొలి రెండు టెస్టుల్లో భారత్ ఏం కోల్పోయిందో రహానె చూపించాడని.. రహానె చేసిన 48 పరుగులు విజయంలో కీలకంగా మారాయని గుర్తుచేశాడు. ఆ మ్యాచ్‌లో భారత్ 63 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. ఇప్పటి పర్యటనలో కూడా రహానె ఉంటే భారత్ ఇంకాస్త మంచి స్కోరు చేసే అవకాశం ఉండేదని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.


మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 27 , 2023 | 05:07 PM