Sunrisers Hyderabad: పెళ్లి చేసుకున్న మార్‌క్రమ్ మామ.. అత్త ఎలా ఉందో చూశారా?

ABN , First Publish Date - 2023-07-23T13:39:24+05:30 IST

సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఎయిడెన్ మార్‌క్రమ్ బ్యాచ్‌లర్ లైఫ్‌కు బైబై చెప్పేసి పెళ్లి చేసుకున్నాడు. బెస్ట్ ఫ్రెండ్ నికోల్‌ను అతడు వివాహమాడాడు. వీరి వివాహం శనివారం నాడు దక్షిణాఫ్రికాలోని సెంచూరియన్‌లో ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు పలువురు క్రికెటర్లు, ప్రముఖులు హాజరయ్యారని తెలుస్తోంది.

Sunrisers Hyderabad: పెళ్లి చేసుకున్న మార్‌క్రమ్ మామ.. అత్త ఎలా ఉందో చూశారా?

దక్షిణాఫ్రికా (South Africa) స్టార్ ప్లేయర్, ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) కెప్టెన్ ఎయిడెన్ మార్‌క్రమ్ (Aiden Markram) బ్యాచ్‌లర్ లైఫ్‌కు బైబై చెప్పేసి ఇటీవల పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి కూతురు ఎవరో కాదు అతడి బెస్ట్ ఫ్రెండ్ నికోల్ (Nichol). ఆమె ఆన్‌లైన్ వేదికగా ఓ జ్యువెలరీ స్టోర్‌ను నడుపుతోంది. గత పదేళ్లుగా మార్‌క్రమ్-నికోల్ ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. గత ఏడాది నిశ్చితార్ధం చేసుకోగా తాజాగా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరి వివాహం శనివారం నాడు దక్షిణాఫ్రికాలోని సెంచూరియన్‌లో ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు పలువురు క్రికెటర్లు, ప్రముఖులు హాజరయ్యారని తెలుస్తోంది. ఈ సందర్భంగా తమ పెళ్లికి సంబంధించిన ఫోటోలను నికోల్ తన సోషల్ మీడియా (Social Media) ఖాతాలో షేర్ చేయగా ఇప్పుడు వైరల్ (Viral) అవుతున్నాయి.


కాగా ఎయిడెన్ మార్‌క్రమ్ దంపతులకు సోషల్ మీడియా వేదికగా అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా మార్‌క్రమ్ వివాహం చేసుకుని అంకుల్స్ క్లబ్‌లో చేరాడని కొందరు కామెంట్ చేస్తున్నారు. మరోవైపు మార్‌క్రమ్ మామ సతీమణి నికోల్ చాలా అందంగా ఉందని కితాబు ఇస్తున్నారు. అత్త బాలీవుడ్ హీరోయిన్‌ మాదిరిగా ఉందని.. ఆమె సూపరో సూపర్ అని కొందరు సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Virat Kohli: ఐదేళ్ల తర్వాత ఓవర్సీస్‌లో సెంచరీ.. కోహ్లీ ఏమన్నాడో తెలుసా?

ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్ట్రర్న్ కేప్‌టౌన్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన మార్‌క్రమ్ మామ అరంగేట్ర సీజన్‌లోనే జట్టును ఛాంపియన్‌గా నిలబెట్టాడు. దీంతో ఐపీఎల్‌లోనూ సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా కేన్ విలియమ్సన్ స్థానంలో ప్రమోషన్ అందుకున్నాడు. అయితే మార్‌క్రమ్ సారథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ దారుణంగా విఫలమైంది. 14 మ్యాచ్‌ల్లో నాలుగు మ్యాచ్‌లలో మాత్రమే గెలిచి పాయింట్ల టేబుల్‌లో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఇప్పుడు అత్త నికోల్ రావడంతో సన్‌రైజర్స్ రాత మారుతుందని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. కనీసం వచ్చే సీజన్‌లోనైనా అదిరిపోయే ప్రదర్శన చేయాలని కోరుకుంటున్నారు.

Updated Date - 2023-07-23T14:10:17+05:30 IST