ODI World Cup: వన్డే ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించిన జట్లు ఇవే.. ఆ నాలుగింటి మధ్య పోటీ!
ABN , First Publish Date - 2023-03-28T21:40:33+05:30 IST
ఈ ఏడాది అక్టోబరులో ప్రారంభం కానున్న వన్డే ప్రపంచకప్(One Day World Cup)కు ఏడు జట్లు నేరగా అర్హత సాధించాయి. చివరి స్థానం కోసం మరో
న్యూఢిల్లీ: ఈ ఏడాది అక్టోబరులో ప్రారంభం కానున్న వన్డే ప్రపంచకప్(One Day World Cup)కు ఏడు జట్లు నేరగా అర్హత సాధించాయి. చివరి స్థానం కోసం మరో నాలుగు జట్లు తలపడనున్నాయి. ఆ నాలుగు జట్లు మరేవో కాదు.. వెస్డిండీస్(West Indies), శ్రీలంక(Sri Lanka), సౌతాఫ్రికా(South Africa), ఐర్లాండ్(Ireland).
క్రికెట్ ప్రపంచకప్ సూపర్ లీగ్ స్టాండింగ్స్‌లో వెస్టిండీస్ 8, శ్రీలంక 9, సౌతాఫ్రికా 10, ఐర్లాండ్ 11వ స్థానంలో ఉన్నాయి. ఈ నాలుగు జట్ల మధ్య జరిగిన పోరులో విజేతలుగా నిలిచిన జట్టు చివరి స్థానాన్ని ఆక్రమిస్తుంది. ఇక, వన్డే ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించిన జట్లలో న్యూజిలాండ్, ఇంగ్లండ్, ఆతిథ్య ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్ ఉన్నాయి.
ప్రపంచ కప్ సూపర్ లీగ్‌లో ప్రతి జట్టు 24-24 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. దక్షిణాఫ్రికా ఇప్పటి వరకు 16 మ్యాచ్‌లు ఆడి 59 పాయింట్లతో ఉంది. ఆ జట్టు ఇంకా 5 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఆ మ్యాచులన్నింటిలోనూ విజయం సాధిస్తే ఆ జట్టు నేరుగా క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది.