Hardik Pandya: మళ్లీ హిందూ సంప్రదాయ పద్ధతిలో హార్థిక్ పాండ్యా, నటాసాల పెళ్లి వేడుక
ABN , First Publish Date - 2023-02-17T07:39:25+05:30 IST
క్రికెటర్ హార్దిక్ పాండ్యా ఉదయపూర్‌లో గురువారం రాత్రి మళ్లీ హిందూ వివాహ ఆచారాలతో నటాసా స్టాంకోవిక్‌ను...
ఉదయపూర్: క్రికెటర్ హార్దిక్ పాండ్యా ఉదయపూర్‌లో గురువారం రాత్రి మళ్లీ హిందూ వివాహ ఆచారాలతో నటాసా స్టాంకోవిక్‌ను వివాహం చేసుకున్నాడు.(Hardik Pandya Gets Married to Natasa Stankovic)టీమ్ ఇండియా ఆల్ రౌండర్, టీ20 ఇంటర్నేషనల్ సారథి హార్దిక్ పాండ్యా ఈ వారం ప్రారంభంలో వాలెంటైన్స్ డే రోజున క్రిస్టియన్ సంప్రదాయపద్ధతిలో పెళ్లి చేసుకున్నారు.ఉదయపూర్(Udaipur) నగరంలో గురువారం రాత్రి మళ్లీ హిందూ సంప్రదాయం ప్రకారం వేదమంత్రాలు పఠిస్తుండగా(Hindu Wedding Rituals) నటాసా స్టాంకోవిచ్ ను వివాహమాడారు.
ఉదయపూర్‌లోని రాఫెల్స్ హోటల్‌లో జరిగిన హిందూ వివాహ చిత్రాలను హార్థిక్ పాండ్యా ట్విట్టరులో పంచుకున్నారు. నటాసాతో జంటగా హార్దిక్ క్రీమ్ కలర్ కుర్తా-పైజామాను ధరించాడు. నటాసా రెడ్ బార్డర్‌లతో కూడిన క్రీమ్ కలర్ లెహంగాతో భారీ ఆభరణాలను ధరించింది. దండలు మార్చుకోవడంతోపాటు నటాసా నుదుటిపై సిధూర్ పెట్టుకున్నారు. మూడేళ్ల క్రితమే హార్థిక్, నటాషాల జంట ప్రేమద్వీపంలో ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకున్నారు.
ఇది కూడా చదవండి : IndiaVsAustralia: సడెన్‌గా హోటల్ ఖాళీ చేసిన టీమిండియా.. జట్టుతోపాటు ఉండని విరాట్ కోహ్లీ
2020వ సంవత్సరం జనవరి 1వతేదీన లాక్‌డౌన్ సమయంలో పెళ్లి చేసుకునే ముందు క్రూయిజ్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు.2020 మే 31వతేదీన మొదటిసారి వీరు వివాహమాడారు. 2020 జులై నెలలోనే వీరికి అగస్త్య అనే కుమారుడు జన్మించాడు. కుమారుడు పుట్టాక మూడోసారి వివాహమాడి వార్తల్లో నిలిచారు.