IND vs WI: తెలుగోడు వచ్చేశాడోచ్! మొదటి టీ20లో టాస్ గెలిచిన వెస్టిండీస్

ABN , First Publish Date - 2023-08-03T19:47:22+05:30 IST

భారత్‌తో మొదటి టీ20 మ్యాచ్‌లో అతిథ్య వెస్టిండీస్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌తో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేస్తున్నాడు. అలాగే యువ పేసర్ ముఖేష్ కుమార్ కూడా ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అరంగేట్రం చేస్తున్నాడు.

IND vs WI: తెలుగోడు వచ్చేశాడోచ్! మొదటి టీ20లో టాస్ గెలిచిన వెస్టిండీస్

ట్రినిడాడ్: భారత్‌తో మొదటి టీ20 మ్యాచ్‌లో అతిథ్య వెస్టిండీస్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌తో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. అలాగే యువ పేసర్ ముఖేష్ కుమార్ కూడా ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. కాగా ముఖేష్ కుమార్ ఈ విండీస్ పర్యటనలోనే టెస్టులు, వన్డేల్లోకి అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే టెస్టు, వన్డే సిరీస్‌లను గెలుచుకున్న భారత జట్టు టీ20 సిరీస్‌ను కూడా కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. మరోవైపు అతిథ్య వెస్టిండీస్ మాత్రం టీ20 సిరీస్‌ను గెలిచి వన్డే, టెస్టు సిరీస్‌లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. ఇక భారత్, వెస్టిండీస్ మధ్య ఇప్పటివరకు 25 టీ20 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో భారత్ 17, వెస్టిండీస్ 7 మ్యాచ్‌లు గెలిచాయి. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. మరోవైపు టీ20 ఫార్మాట్‌లో భారత్‌కు ఇది 200వ మ్యాచ్ కావడం విశేషం. దీంతో 200 టీ20 మ్యాచ్‌లు ఆడిన రెండో టీంగా భారత్ చరిత్ర సృష్టించింది.


తుది జట్లు

వెస్టిండీస్:

కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్, జాన్సన్ చార్లెస్ (వికెట్ కీపర్), నికోలస్ పూరన్, షిమ్రాన్ హెట్‌మేయర్, రోవ్‌మన్ పావెల్ (కెప్టెన్), జేసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్‌కాయ్

భారత్:

శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), సంజు శాంసన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్

Updated Date - 2023-08-03T20:17:51+05:30 IST