Home » India tour of west indies2023
కీలకమైన ఐదో టీ20లో భారత బ్యాటర్ల తడబడ్డారు. సూర్యకుమార్ యాదవ్(61) మినహా ఇతర బ్యాటర్లెవరూ రాణించకపోవడంతో వెస్టిండీస్ ముందు టీమిండియా 166 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని ఉంచగలిగింది.
వెస్టిండీస్‌తో కీలకమైన ఐదో టీ20 మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. అటు వెస్టిండీస్ కెప్టెన్ పావెల్ ముందుగా తమకు బౌలింగ్ వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేయడం గమనార్హం.
హెట్మేయర్(61) హాఫ్ సెంచరీతో చెలరేగడానికి తోడు షాయ్ హోప్(45) రాణించడంతో నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత్ ముందు వెస్టిండీస్ 179 పరుగుల టఫ్ లక్ష్యాన్ని చేధించింది.
భారత్‌తో నాలుగో టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియాలో తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది. కాగా వెస్టిండీస్ మాత్రం 3 మార్పులతో బరిలోకి దిగుతుంది.
భారత్, వెస్టిండీస్ మధ్య శనివారం నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది. సిరీస్‌లోని మొదటి 3 టీ20లు వెస్టిండీస్‌లో జరగగా చివరి 2 టీ20లు అమెరికాలోని ఫ్లోరిడాలో గల సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియం టర్ఫ్ గ్రౌండ్ మైదానంలో జరగనున్నాయి.
టీమిండియా టీ20 జట్టు కెప్టెన్ హార్దిక్(Hardik Pandya) పాండ్యా ఇటీవల వరుసగా విమర్శలకు గురవుతున్నాడు. వన్డే సిరీస్ సమయంలో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు(west indies cricket board) సరైన వసతులు కల్పించడంలేదని మాట్లాడి పలువురు నుంచి విమర్శలను ఎదుర్కొన్నాడు. ఇక మొదటి రెండు టీ20ల్లో ఓడిన తర్వాత హార్దిక్ కెప్టెన్సీపై విమర్శల వర్షం కురిసింది.
మూడో టీ20లో భారత్ ముందు వెస్టిండీస్ 160 పరుగుల టఫ్ లక్ష్యాన్ని ఉంచింది. పిచ్ గత రెండు టీ20ల మాదిరిగానే స్లోగా ఉండడంతో చేధన అంత సులభం కాకపోవచ్చు.
కీలకమైన మూడో టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. గాయపడిన జేసన్ హోల్డర్ స్థానంలో చేజ్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది.
భారత్, వెస్టిండీస్ మధ్య మంగళవారం మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే సిరీస్‌లోని మొదటి రెండు మ్యాచ్‌లు గెలిచి 2-0తో అధిక్యంలో ఉన్న విండీస్ మూడో మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. మరోవైపు భారత జట్టుకు మాత్రం ఈ మ్యాచ్ డూ ఆర్ డైగా మారింది.
భారత క్రికెటర్, పశ్చిమ బెంగాల్ మంత్రి మనోజ్ తివారీ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (CAB) అధ్యక్షుడు స్నేహాశిష్ గంగూలీతో సమావేశం అనంతరం 37 ఏళ్ల తివారీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. దీంతో స్నేహాశిష్ గంగూలీ సూచన మేరకు తివారీ తన రిటైర్మెంట్ నిర్ణయంపై మనసు మార్చుకున్నట్లు సమాచారం.