IND vs WI 2nd ODI: భారత్ vs వెస్టిండీస్ రెండో వన్డేకు వర్షం అంతరాయం.. టీమిండియా స్కోర్ ఎంతంటే..?

ABN , First Publish Date - 2023-07-29T21:34:48+05:30 IST

భారత్, వెస్టిండీస్ రెండో మ్యాచ్‌కు వర్షం అంతరాయం కల్గించింది. దీంతో వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయే సమయానికి భారత జట్టు 24.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. సంజూశాంసన్ ఔటైన వెంటనే వర్షం ప్రారంభమైంది. ప్రస్తుతం క్రీజులో సూర్యకుమార్ యాదవ్ పరుగులేమి చేయకుండా నాటౌట్‌గా ఉన్నాడు.

IND vs WI 2nd ODI: భారత్ vs వెస్టిండీస్ రెండో వన్డేకు వర్షం అంతరాయం.. టీమిండియా స్కోర్ ఎంతంటే..?

బార్బడోస్: భారత్, వెస్టిండీస్ రెండో మ్యాచ్‌కు వర్షం అంతరాయం కల్గించింది. దీంతో వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయే సమయానికి భారత జట్టు 24.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. సంజూశాంసన్ ఔటైన వెంటనే వర్షం ప్రారంభమైంది. ప్రస్తుతం క్రీజులో సూర్యకుమార్ యాదవ్ పరుగులేమి చేయకుండా నాటౌట్‌గా ఉన్నాడు. వర్షం ఆగితే సూర్యతో కలిసి జడేజా బ్యాటింగ్ చేయనున్నాడు. ఇక విండీస్ ఆహ్వానం మేరకు మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియాకు ఓపెనర్లు ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్ మంచి ఆరంభాన్నిచ్చారు. వీరిద్దరు మొదటి వికెట్‌కు 90 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. విండీస్ గడ్డపై కిషన్ వరుసగా మూడో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ కొట్టడం గమనార్హం. ఇక వన్డేల్లో కిషన్‌కు ఇది 5వ హాఫ్ సెంచరీ. అయితే ఈ భాగస్వామ్యాన్ని 17వ ఓవర్‌లో స్పిన్నర్ గుడాకేష్ మోతీ విడదీశాడు. 34 పరుగులు చేసిl గిల్.. అల్జారీ జోసెఫ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. రొమారియో షెపర్డ్ వేసిన ఆ తర్వాతి ఓవర్‌లోనే కిషన్(55) కూడా ఔటయ్యాడు. ఇక ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సంజూశాంసన్(9), అక్షర్ పటేల్(1), హార్దిక్ పాండ్యా(7) సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేరారు. దీంతో 113 పరుగులకే టీమిండియా సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. విండీస్ బౌలర్లలో రొమారియో షెపర్డ్ 2, మోతీ, జేడెన్ సీల్స్, యానిక్ కరియా తలో వికెట్ తీశారు.


వెస్టిండీస్ తుది జట్టు

బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, అలిక్ అథానాజ్, షాయ్ హోప్(వికెట్ కీపర్/కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, కీసీ కార్టీ, రొమారియో షెపర్డ్, యానిక్ కరియా, గుడాకేష్ మోటీ, అల్జారీ జోసెఫ్, జేడెన్ సీల్స్

టీమిండియా తుది జట్టు

శుభమన్ గిల్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేష్ కుమార్

Updated Date - 2023-07-29T21:34:48+05:30 IST