IND vs BAN: మూడో టీ20లో భారత అమ్మాయిలు ఓటమి.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ఎవరంటే..?

ABN , First Publish Date - 2023-07-13T17:29:53+05:30 IST

బంగ్లాదేశ్‌ ఉమెన్స్‌ జట్టుతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత అమ్మాయిలు ఓటమిపాలయ్యారు. లో స్కోరింగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ అమ్మాయిలు 4 వికెట్ల తేడాతో గెలుపొందారు. ఓడినప్పటికీ సిరీస్‌ను మాత్రం 2-1 తేడాతో టీమిండియానే కైవసం చేసుకుంది.

IND vs BAN: మూడో టీ20లో భారత అమ్మాయిలు ఓటమి.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ఎవరంటే..?

ఢాకా: బంగ్లాదేశ్‌ ఉమెన్స్‌ జట్టుతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత అమ్మాయిలు ఓటమిపాలయ్యారు. లో స్కోరింగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ అమ్మాయిలు 4 వికెట్ల తేడాతో గెలుపొందారు. ఓడినప్పటికీ సిరీస్‌ను మాత్రం 2-1 తేడాతో టీమిండియానే కైవసం చేసుకుంది. కాగా మొదటి రెండు టీ20 మ్యాచ్‌లను భారత జట్టే గెలిచిన సంగతి తెలిసిందే. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది.


ఈ మ్యాచ్‌లో భారత్ విసిరిన 103 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ జట్టు 6 వికెట్లు కోల్పోయి మరో 10 బంతులు మిగిలి ఉండగానే చేధించింది. గత మ్యాచ్‌లో 96 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించలేకపోయినా బంగ్లాదేశ్ ఈ సారి మాత్రం ఆ తప్పు జరగనివ్వలేదు. 42 పరుగులు చేసిన షమీమా సుల్తానా టాప్ స్కోరర్‌గా నిలిచింది. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా అతన్నే వరించింది. భారత బౌలర్లలో దేవికా వైద్య, మిన్ను మణి రెండేసి వికెట్లు తీశారు. అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 102 పరుగులు మాత్రమే చేసింది. 40 పరుగులు చేసిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ నాటౌట్‌గా నిలిచింది. జెమీమా రోడ్రిగ్స్ 28 పరుగులు చేసింది. రబేయా ఖాన్ 3, సుల్తానా ఖాతున్ 2 వికెట్లు తీశారు. భారత జట్టు 15 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 86 పరుగులు చేసి మంచి స్థితిలోనే కనిపించింది. కానీ ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది. చివరి 5 ఓవర్లలో 16 పరుగులు మాత్రమే చేసి ఏకంగా 6 వికెట్లు కోల్పోయింది. దీంతో స్కోర్‌ బోర్డుపై మంచి స్కోర్‌ను ఉంచలేకపోయింది.

Updated Date - 2023-07-13T17:29:53+05:30 IST