ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేసిన బుమ్రా.. ఏం చెప్పాడో తెలిస్తే ఎగిరి గంతేస్తారు..

ABN , First Publish Date - 2023-07-18T18:14:30+05:30 IST

టీమిండియా పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా జట్టుకు దూరమై ఏడాది కాలం కావొస్తుంది. అయితే బుమ్రా గాయం నుంచి దాదాపుగా కొలుకున్నాడని త్వరలోనే జట్టులోకి వస్తాడని ఈ మధ్య పలు జాతీయ వార్తా సంస్థలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో తన రీఎంట్రీపై స్వయాన బుమ్రానే స్పందించాడు.

ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేసిన బుమ్రా.. ఏం చెప్పాడో తెలిస్తే ఎగిరి గంతేస్తారు..

టీమిండియా పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా జట్టుకు దూరమై ఏడాది కాలం కావొస్తుంది. అయితే బుమ్రా గాయం నుంచి దాదాపుగా కొలుకున్నాడని త్వరలోనే జట్టులోకి వస్తాడని ఈ మధ్య పలు జాతీయ వార్తా సంస్థలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో తన రీఎంట్రీపై స్వయాన బుమ్రానే స్పందించాడు. నేను ఇంటికి వస్తున్నానని చెబుతూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తాను ప్రాక్టీస్ చేస్తున్న ఓ వీడియోను పోస్ట్ చేశాడు. దీనికి "I Am Coming Home" అని రాశాడు. అంతేకాకుండా ఆ వీడియో బ్యాంగ్రౌండ్‌లో అలెగ్జాండర్ జూనియర్ గ్రాంట్ రాసిన ఓ పాపులర్ పాట కూడా వస్తుంది. ‘‘నేను వస్తున్నాననే విషయం ఈ ప్రపంచానికి చెప్పండి, నిన్నటి బాధలన్నీ ఆ వానలో కొట్టుకుపోనివ్వండి, నా కోసం రాజ్యం ఎదురు చూస్తోంది, వాళ్లు నా తప్పులన్నీ క్షమించేశారు.’’ అని అర్థం వచ్చేలా ఆ పాటలోని లిరిక్స్ ఉన్నాయి. కాగా ఈ వీడియోను బుమ్రా బీసీసీఐకి ట్యాగ్ చేయడం గమనార్హం. దీంతో స్పందించిన బీసీసీఐ ‘‘నీ రీఎంట్రీ కోసం ఇంకా ఎదురు చూడలేం. త్వరగా వచ్చేయ్’’ అని రిప్లై ఇచ్చింది. అటు అభిమానులు కూడా బుమ్రా త్వరగా జట్టులోకి రావాలని ఆశిస్తూ కామెంట్లు చేస్తున్నారు. అంతేకాకుండా బుమ్రా పోస్ట్ చేసిన వీడియోను చూసి అతను పూర్తిగా కోలుకున్నట్టేనని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


కాగా 29 ఏళ్ల బుమ్రా వెన్నునొప్పి కారణంగా దాదాపుగా ఏడాది కాలంగా జట్టుకు దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే గత వేసవిలో న్యూజిలాండ్‌లో వెన్నునొప్పికి చికిత్స చేయించుకున్నాడు. అప్పటి నుంచి బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్నాడు. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు బుమ్రా దాదాపుగా కోలుకున్నట్టుగానే తెలుస్తోంది. ఇప్పటికే బుమ్రా ప్రతి రోజు 10 ఓవర్లు బౌలింగ్ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఆసియా కప్‌లో బుమ్రా ఆడతాడని సమాచారం. తాజాగా బుమ్రా వీడియో పోస్ట్ చేయడంతో గాయం నుంచి కోలుకున్నాడని అర్థం అవుతోంది. అవసరమైతే ఐర్లాండ్ పర్యటనలోనే బుమ్రా బరిలోకి దిగే అవకాశాలున్నాయి.

Updated Date - 2023-07-18T18:14:30+05:30 IST