Second ODI India: భారత్‌ తడ‘బ్యాటు’

ABN , First Publish Date - 2023-07-30T03:18:23+05:30 IST

వెస్టిండీస్‌(West Indies)తో రెండో వన్డేలోనూ భారత(India) బ్యాటింగ్‌ ఆర్డర్‌ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. స్లో పిచ్‌పై పరుగులు సాధించడంలో బ్యాటర్ల వైఫల్యం స్పష్టంగా కనిపించింది.

Second ODI India: భారత్‌ తడ‘బ్యాటు’

181 ఆలౌట్‌

ఇషాన్‌ అర్ధసెంచరీ

విండీస్‌తో రెండో వన్డే

విండీస్‌తో వన్డేల్లో వరుసగా రెండు అర్ధసెంచరీలు చేసిన రెండో భారత వికెట్‌ కీపర్‌గా ఇషాన్‌. 2017లో ధోనీ ఈ ఫీట్‌ సాధించాడు.

బ్రిడ్జిటౌన్‌: వెస్టిండీస్‌(West Indies)తో రెండో వన్డేలోనూ భారత(India) బ్యాటింగ్‌ ఆర్డర్‌ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. స్లో పిచ్‌పై పరుగులు సాధించడంలో బ్యాటర్ల వైఫల్యం స్పష్టంగా కనిపించింది. ఓపెనర్లు ఇషాన్‌ (55), గిల్‌ (34) అందించిన శుభారంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. తొలి వికెట్‌కు ఈ జోడీ 90 పరుగులు అందిస్తే.. ఆ తర్వాత మిగతా బ్యాటర్లంతా కలిసి చేసింది 91 పరుగులే కావడం గమనార్హం. దీంతో శనివారం పలుమార్లు వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు 40.5 ఓవర్లలో 181 పరుగులకే కుప్పకూలింది. స్పిన్నర్‌ గుడకేశ్‌ మోటీ, పేసర్‌ షెఫర్డ్‌లకు మూడేసి.. జోసె్‌ఫకు రెండు వికెట్లు దక్కాయి. ఇక అవిశ్రాంతంగా క్రికెట్‌ ఆడుతున్న కెప్టెన్‌ రోహిత్‌, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ ఈ మ్యాచ్‌కు విశ్రాంతి తీసుకున్నారు. దీంతో హార్దిక్‌ సారథ్యంలో జట్టు బరిలోకి దిగగా.. సంజూ శాంసన్‌, అక్షర్‌లకు చోటు కల్పించారు. అయితే ఆఖరి వన్డేలో రోహిత్‌, విరాట్‌ ఆడతారని హార్దిక్‌ చెప్పాడు.

ఓపెనర్లు రాణించినా..

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు ఇషాన్‌, గిల్‌ ఈసారి శుభారంభం అందించారు. అయితే టర్న్‌, బౌన్స్‌ను సద్వినియోగం చేసుకున్న స్పిన్నర్‌ మోటీ, పేసర్‌ షెఫర్డ్‌ల ధాటికి మిగతా బ్యాటర్లు దారుణంగా తడబడ్డారు. అటు విండీస్‌ ఫీల్డింగ్‌లోనూ ఆకట్టుకోవడం విశేషం. ఆరంభంలో ప్రత్యర్థి బౌలర్లను యువ ఓపెనర్లు దీటుగా ఎదుర్కొన్నారు. అడపాదడపా బౌండరీలతో జట్టుకు భారీ స్కోరు ఖాయమనేలా వీరి ఆటతీరు సాగింది. ఈక్రమంలో ఇషాన్‌ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ మెరిశాడు. అటు టెస్టు సిరీ్‌సతో పాటు తొలి వన్డేలో విఫలమైన గిల్‌ జాగ్రత్తగా ఆడుతూ క్రీజులో పాతుకుపోయాడు.


Romario-Shepherd-(R).jpg

నాలుగో ఓవర్‌లో తను రెండు ఫోర్లతో ఆకట్టుకోగా.. ఇషాన్‌ సైతం 8వ ఓవర్‌లో వరుసగా రెండు ఫోర్లు బాదాడు. 34 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఇషాన్‌ క్యాచ్‌ను మోటీ వదిలేశాడు. అయితే చక్కగా కుదురుకున్న ఈ జోడీకి వరుస ఓవర్లలో షాక్‌ తగిలింది. 17వ ఓవర్‌లో గిల్‌ను స్పిన్నర్‌ మోటీ అవుట్‌ చేయగా.. తర్వాతి ఓవర్‌లో బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌లో అథనజె డైవింగ్‌ క్యాచ్‌తో ఇషాన్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. ఈ వికెట్‌ షెఫర్డ్‌ తీశాడు. అనంతరం భారత్‌ తడబాటు కూడా ఆరంభమైంది. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన సంజూ శాంసన్‌ (9), అక్షర్‌ (1) వెంటవెంటనే అవుటయ్యారు. మధ్యలో వర్షం కారణంగా అర్ధగంట మ్యాచ్‌ ఆగింది. ఆ తర్వాత కూడా వికెట్‌ బ్యాటింగ్‌కు సహకరించకపోవడంతో పరుగులు కూడా నెమ్మదించాయి. దీనికి తోడు వరుస ఓవర్లలో జడేజా (10), సూర్యకుమార్‌ (24) వెనుదిరిగారు. శార్దూల్‌ (16) వేగంగా ఆడాలని చూసినా కాసేపే అయ్యింది. చివరి ఐదు వికెట్లు జట్టు 68 పరుగుల తేడాలోనే కోల్పోయింది.

స్కోరుబోర్డు

భారత్‌:

ఇషాన్‌ (సి) అథనజె (బి) షెఫర్డ్‌ 55, గిల్‌ (సి) జోసెఫ్‌ (బి) మోటీ 34, సంజూ (సి) కింగ్‌ (బి) కారియా 9, అక్షర్‌ (సి) హోప్‌ (బి) షెఫర్డ్‌ 1, హార్దిక్‌ (సి) కింగ్‌ (బి) సీల్స్‌ 7, సూర్యకుమార్‌ (సి) అథనజె (బి) మోటీ 24, జడేజా (సి) కారియా (బి) షెఫర్డ్‌ 10, శార్దూల్‌ (ఎల్బీ) జోసెఫ్‌ 16, కుల్దీప్‌ (నాటౌట్‌) 8, ఉమ్రాన్‌ (సి) కార్టీ (సి) జోసెఫ్‌ 0, ముఖేష్‌ (సి) హెట్‌మయెర్‌ (బి) మోటీ 6, ఎక్స్‌ట్రాలు 11, మొత్తం: 40.5 ఓవర్లలో 181 ఆలౌట్‌; వికెట్ల పతనం : 1-90, 2-95, 3-97, 4-113, 5-113, 6-146, 7-148, 8-167, 9-167; బౌలింగ్‌: మేయర్స్‌ 5-0-18-0, సీల్స్‌ 6-0-28-1, జోసెఫ్‌ 7-0-35-2, గుడకేశ్‌ మోటీ 9.5-0-36-3, షెఫర్డ్‌ 8-1-37-3, యానిక్‌ కారియా 5-0-25-1.

Updated Date - 2023-07-30T03:18:23+05:30 IST