IND vs WI: టీ20 సిరీస్‌కు వెస్టిండీస్ జట్టు ఎంపిక.. టీంలోకి విధ్వంసకర బ్యాటర్!

ABN , First Publish Date - 2023-08-01T17:54:57+05:30 IST

భారత్‌తో జరిగే 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. 15 మందితో కూడిన జట్టును ప్రకటించిన సెలెక్టర్లు కెప్టెన్సీ బాధ్యతలను రోవ్‌మన్ పావెల్‌కు అప్పగించారు. వైస్ కెప్టెన్‌గా కైల్ మేయర్స్ వ్యవహరించనున్నాడు.

IND vs WI: టీ20 సిరీస్‌కు వెస్టిండీస్ జట్టు ఎంపిక.. టీంలోకి విధ్వంసకర బ్యాటర్!

భారత్‌తో జరిగే 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. 15 మందితో కూడిన జట్టును ప్రకటించిన సెలెక్టర్లు కెప్టెన్సీ బాధ్యతలను రోవ్‌మన్ పావెల్‌కు అప్పగించారు. వైస్ కెప్టెన్‌గా కైల్ మేయర్స్ వ్యవహరించనున్నాడు. వన్డే సిరీస్‌లో రాణించిన షాయ్ హోప్‌తోపాటు నికోలస్ పూరన్, రోస్టన్ ఛేజ్, జాసన్ హోల్డర్ తిరిగి టీ20 జట్టులోకి పునారగమనం చేశారు. కాగా ఇటీవల ముగిసిన అమెరికా మేజర్ లీగ్ టోర్నీలో నికోలస్ పూరన్ అదరగొట్టాడు. ఫైనల్‌లో సెంచరీతో విధ్వంసం సృష్టించాడు. పూరన్ భారత్‌పైనా కూడా చెలరేగితే మన బౌలర్లకు కష్టాలు తప్పకపోవచ్చు. కాగా రాబోయే ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని జట్టును ఎంపిక చేసినట్లు వెస్టిండీస్ చీఫ్ సెలెక్టర్ డెస్మండ్ హేన్స్ చెప్పారు. 2024 ప్రపంచకప్‌నకు అమెరికాతో కలిసి వెస్టిండీస్ అతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఇక భారత్, వెస్టిండీస్ మధ్య ఈ నెల 3, 6, 8, 12, 13 తేదీల్లో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది.


వెస్టిండీస్ స్క్వాడ్:

రోవ్‌మన్ పావెల్ (కెప్టెన్), కైల్ మేయర్స్ (వైస్ కెప్టెన్), జాన్సన్ చార్లెస్, రోస్టన్ చేజ్, షిమ్రాన్ హెట్మెయర్, జాసన్ హోల్డర్, షాయ్ హోప్, అకేల్ హోసేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, ఒబెడ్ మెక్‌కాయ్, నికోలస్ పూరన్, రొమారియో షెపర్డ్, ఓడియన్ స్మిత్, ఒషానే థామస్

కాగా ఈ టీ20 సిరీస్‌కు భారత జట్టును ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ జట్టుకు కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా, వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వ్యవహరించనున్నారు.

టీమిండియా స్క్వాడ్:

ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్

Updated Date - 2023-08-01T17:54:57+05:30 IST