Women Wrestlers: బ్రిజ్ భూషణ్ కేసుల్లో ఏడుగురు మహిళా రెజ్లర్ల వాంగ్మూలాల నమోదు
ABN , First Publish Date - 2023-05-06T09:16:26+05:30 IST
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై నమోదైన కేసులకు సంబంధించి కీలక పరిణామం...
న్యూఢిల్లీ: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై నమోదైన కేసులకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది.(Women Wrestlers) ఈ కేసుల్లో ఢిల్లీ పోలీసులు ఏడుగురు మహిళా రెజ్లర్ల వాంగ్మూలాలను(Statements Of 7 Women Wrestlers) నమోదు (Recorded)చేశారు.(Women Wrestlers)బ్రిజ్ భూషణ్ సింగ్‌పై(Against Wrestling Body Chief) మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి ఏప్రిల్ 28వతేదీన ఢిల్లీ పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు.
ఇది కూడా చదవండి : Two Encounters : రాజౌరి,బారాముల్లాలో రెండు ఎన్‌కౌంటర్లు...ఉగ్రవాది హతం
సింగ్‌పై ఐపీసీ సెక్షన్‌లు 354, 354 ఎ, 354డి,పోక్సో చట్టం కింద ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుల్లో రెజ్లర్ల వాంగ్మూలాలను నమోదు చేశామని, విచారణ జరుగుతోందని ఓ పోలీసు అధికారి తెలిపారు.ఎఫ్‌ఐఆర్‌లలో పేర్కొన్న సంఘటనలు 2012, 2022 మధ్య విదేశాలతో సహా వివిధ ప్రదేశాల్లో జరిగాయి.బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్టు చేసి అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏప్రిల్ 23వతేదీ నుంచి జంతర్ మంతర్ వద్ద రెజ్లర్లు బైఠాయించారు.