Sourav Ganguly: త్రిపుర రాష్ట్ర టూరిజం అంబాసిడర్‌గా సౌరవ్ గంగూలీ
ABN , First Publish Date - 2023-05-24T08:20:40+05:30 IST
భారతీయ క్రికెట్ దిగ్గజం సౌరవ్ గంగూలీ బీజేపీ పాలిత త్రిపుర బ్రాండ్ అంబాసిడర్‌గా మారబోతున్నారు. భారత మాజీ కెప్టెన్ త్రిపుర పర్యాటక శాఖ మంత్రి సుశాంత చౌదరితో మంగళవారం కోల్‌కతా నివాసంలో సమావేశమైన తర్వాత ఈ నిర్ణయం అధికారికంగా సౌరవ్ గంగూలీ పంచుకున్నారు....
కోల్‌కతా: భారతీయ క్రికెట్ దిగ్గజం సౌరవ్ గంగూలీ బీజేపీ పాలిత త్రిపుర బ్రాండ్ అంబాసిడర్‌గా మారబోతున్నారు. భారత మాజీ కెప్టెన్ త్రిపుర పర్యాటక శాఖ మంత్రి సుశాంత చౌదరితో మంగళవారం కోల్‌కతా నివాసంలో సమావేశమైన తర్వాత ఈ నిర్ణయం అధికారికంగా సౌరవ్ గంగూలీ పంచుకున్నారు. (Indian cricket legend Sourav Ganguly)సౌరవ్ గంగూలీని రాష్ట్ర కొత్త టూరిజం అంబాసిడర్‌గా(Tripura tourism ambassador) నియమిస్తున్నట్లు త్రిపుర ప్రభుత్వం ప్రకటించింది.
త్రిపుర పర్యాటక శాఖ మంత్రి సుశాంత చౌదరి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని కలిశారు.‘‘భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ త్రిపుర టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండాలనే మా ప్రతిపాదనను అంగీకరించడం గర్వించదగిన విషయం. ఈ రోజు ఆయనతో టెలిఫోనులో సంభాషించాను. గంగూలీ జీ భాగస్వామ్యం ఖచ్చితంగా త్రిపుర రాష్ట్ర పర్యాటక రంగానికి ఊపునిస్తుందని విశ్వసిస్తున్నాను.’’ అని త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా చెప్పారు.
ఇది కూడా చదవండి: Prime Minister Narendra Modi:భారత్‌లో జరిగే క్రికెట్ వరల్డ్ కప్, దీపావళి వేడుకలను వీక్షించండి...ఆస్ట్రేలియా ప్రధానికి మోదీ ఆహ్వానం
త్రిపుర రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ చర్య తీసుకున్నట్లు త్రిపుర టూరిజం మంత్రి సుశాంత చౌదరి చెప్పారు. త్రిపుర సీనియర్ ప్రభుత్వ అధికారులతో కలిసి మంత్రి క్రికెట్ స్టార్‌ను కలిశారు.త్రిపుర పర్యాటకాన్ని ప్రపంచానికి ప్రచారం చేయడానికి భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ దాదా సౌరవ్ గంగూలీ కంటే ఎక్కువ ప్రజాదరణ పొందిన వ్యక్తి ఎవరు ఉండగలరు? అని మంత్రి చౌదరి ప్రశ్నించారు.