Virat Kohli: దక్షిణాఫ్రికా నుంచి భారత్ వచ్చేసిన విరాట్ కోహ్లీ !
ABN , Publish Date - Dec 22 , 2023 | 03:58 PM
దక్షిణాఫ్రికా వర్సెస్ భారత్ మధ్య ఈ నెల 26 నుంచి 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆరంభానికి ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది. స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ అనూహ్యంగా ఆతిథ్య సౌతాఫ్రికా నుంచి స్వదేశానికి బయలుదేరినట్టు మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి.
దక్షిణాఫ్రికా వర్సెస్ భారత్ మధ్య ఈ నెల 26 నుంచి 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆరంభానికి ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది. స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ అనూహ్యంగా ఆతిథ్య సౌతాఫ్రికా నుంచి స్వదేశానికి బయలుదేరినట్టు మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. కుటుంబంలో మెడికల్ అత్యవసర పరిస్థితి దృష్ట్యా కోహ్లీ స్వదేశానికి వచ్చినట్టు సమాచారం. డిసెంబర్ 26న ప్రారంభం కానున్న టెస్టు సిరీస్‌లో విరాట్ కోహ్లీ ఆడాల్సి ఉంది. అయితే కోహ్లీ నిజంగానే భారత్ వస్తే టెస్ట్ సిరీస్‌లో ఆడే అవకాశం ఉందా లేదా అనేది వెల్లడికావాల్సి ఉంది. విరాట్ మూడు రోజుల క్రితమే భారత్ బయలుదేరినట్టు ‘క్రిక్‌బజ్’ రిపోర్టు పేర్కొంది. ప్రిటోరియా వేదికగా మూడు రోజులపాటు కొనసాగనున్న ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్‌కు దూరంగా ఉంటానని బీసీసీఐ, టీమిండియా మేనేజ్‌మెంట్ కోహ్లీ అనుమతి తీసుకున్నట్టు తెలిపింది. కాగా డిసెంబర్ 22 (నేడు) తిరిగి దక్షిణాఫ్రికాకు బయలుదేరే అవకాశం ఉందని, సెంచూరియన్ వేదికగా జరిగే తొలి టెస్టుకు అందుబాటులో ఉండనున్నట్టు బీసీసీఐ వర్గాలు ప్రస్తావించాయి.
మరోవైపు స్టార్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ టెస్ట్ సిరీస్‌కు దూరమయ్యాడు. రుతురాజ్ గైక్వాడ్ వేలి గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఇటీవలే దక్షిణాఫ్రికాతో ముగిసిన మూడ వన్డేల సిరీస్‌లో రెండో మ్యాచ్‌లో గైక్వాడ్ గాయపడ్డాడు. గైక్వాడ్ పూర్తిగా కోలుకోలేదని బీసీసీఐ మెడికల్ టీమ్ తెలిపింది. దీంతో టెస్ట్ సిరీస్‌కు అతడు దూరమయ్యాడు. కాగా గాయం కారణంగా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ ఇప్పటికే దూరమైన విషయం తెలిసిందే.