Threads App: థ్రెడ్స్ యాప్‌ని డిలిట్ చేస్తున్నారా?..ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే..లేదంటే..

ABN , First Publish Date - 2023-07-07T20:04:23+05:30 IST

మెటా సంస్థ కొత్తగా లాంచ్ చేసిన థ్రెడ్స్ యాప్ ఇన్‌స్టాల్ చేస్తున్నారా? మీరు ఒకసారి థ్రెడ్స్ యాప్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత దానిని డెలిట్ చేయాలంటే అది ఇన్‌స్టాగ్రామ్‌తో ముడిపడి ఉంటుంది.

Threads App: థ్రెడ్స్ యాప్‌ని డిలిట్ చేస్తున్నారా?..ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే..లేదంటే..

మెటా(Meta) సంస్థ కొత్తగా లాంచ్ చేసిన థ్రెడ్స్ యాప్(Threads App) ఇన్‌స్టాల్ చేస్తున్నారా? మీరు ఒకసారి థ్రెడ్స్ యాప్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత దానిని డిలిట్ చేయాలంటే అది ఇన్‌స్టాగ్రామ్‌తో ముడిపడి ఉంటుంది.

మీరు ఎప్పుడైనా థ్రెడ్స్ అకౌంట్‌ను తొలగించాలంటే ఇన్‌స్టాగ్రామ్ యాప్‌(Instagram App)ను కూడా తొలగిస్తే గానీ ఇది సాధ్యపడదు. ఇదే విషయం థ్రెడ్స్ ప్రైవసీ పాలసీలో రీడ్స్ నోట్ చెబుతోంది. అయితే ఇదే నోట్ మరో విషయాన్ని కూడా తెలియజేస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ను టచ్ చేయకుండా కూడా థ్రెడ్స్ యాప్‌ను డిలిట్ చేయొచ్చని చెబుతోంది.

కాగా.. జూలై 5న మెటా తన కొత్త సోషల్ మీడియా నెట్‌వర్క్‌ని లాంఛనంగా ప్రారంభించింది. అప్పటినుంచి 30 మిలియన్ల వినియోగదారులను సంపాదించింది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన ఏకైక ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌గా గుర్తింపు పొందింది. అయితే చాలామంది నియమనిబంధనలు పూర్తిగా చదవకుండానే సైన్‌అప్ అయ్యారు. థ్రెడ్స్ యాప్ అనేది ఇన్‌స్టాగ్రామ్ యాప్ అనుబంధంగా క్రియేట్ చేశారు.. కాబట్టి తప్పనిసరి ఇన్‌స్టాగ్రమ్ యాప్‌ను కలిగి ఉండాలని నిబంధనల్లో సూచించింది. అయితే ఇన్‌స్టా గ్రామ్ లేకుండా కూడా థ్రెడ్స్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయొచ్చు..డెలిట్ చేయొచ్చు.

‘‘ఇన్‌స్టాగ్రమ్‌‌తో సంబంధం లేకుండా థ్రెడ్స్ యాప్‌ను డిలిట్ చేసే మరో మార్గం కోసం సెర్చ్ చేస్తున్నామని ’’ ఇన్‌స్టాగ్రామ్ సీఈవో థ్రెడ్స్ పోస్ట్‌లో తెలిపారు. అయితే ఎప్పుడు జరుగుతుందనేది తాత్కాలిక తేదీని ప్రకటించలేదు. ప్రస్తుతానికి డీయాక్టివేషన్ మీదనే వినియోగదారులు ఆధారపడాలని సూచించారు.

యాప్‌లో ఫ్రొఫైల్ ట్యాబ్‌కు వెళ్లి కుడి వైపున ‘మెనూ’ క్లిక్ చేసి ఆపై ‘ఖాతా’ తర్వాత డీయాక్టివేషన్ బటన్ నొక్కాలి. తర్వాత యాప్‌లోకి రీ లాగిన్ చేయడం ద్వారా ఎప్పటిలాగే యాప్ వినియోగించవచ్చు.

Updated Date - 2023-07-07T20:16:52+05:30 IST