Telangana Congress: 62 మంది ఖరారు!..
ABN , First Publish Date - 2023-10-08T04:59:18+05:30 IST
రానున్న అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్రంలోని 62 నియోజకవర్గాలకు కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారైనట్లు తెలుస్తోంది. అయితే అభ్యర్థుల ప్రకటన మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
కాంగ్రెస్‌లో ఏకాభిప్రాయం
మిగిలినచోట్ల ఫ్లాష్ సర్వేలు
బస్సుయాత్ర తర్వాతే జాబితా
పొత్తుల పైనా అప్పుడే స్పష్టత
కులాల వారీ టికెట్లకు డిమాండ్లు
ఢిల్లీకి పలువురు నేతల చక్కర్లు
సమగ్ర పరిశీలనతో ప్రకటన
అన్ని స్థానాలకూ ఒకేసారి వెల్లడి
హైదరాబాద్, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): రానున్న అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్రంలోని 62 నియోజకవర్గాలకు కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారైనట్లు తెలుస్తోంది. అయితే అభ్యర్థుల ప్రకటన మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పార్టీ ముఖ్య నాయకులు ఈ నెల 15 నుంచి బస్సుయాత్ర చేపట్టనున్న నేపథ్యంలో.. ఆ యాత్ర తర్వాతే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. బస్సుయాత్ర పూర్తయ్యేలోపు రాష్ట్రంలోని అన్ని స్థానాలకు ఎంపిక ప్రక్రియను పూర్తిచేసి.. యాత్ర ముగిశాక అభ్యర్థులందరి పేర్లు ఒకేసారి ప్రకటించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక కసరత్తులో భాగంగా ఇప్పటికే ఓసారి సమావేశమైన స్ర్కీనింగ్ కమిటీ.. వంద నియోజకవర్గాలపై పరిశీలన చేసి 80కి పైగా స్థానాల్లో ఒక అభిప్రాయానికి వచ్చింది. అందులో 60కి పైగా నియోజకవర్గాల్లో ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. మిగిలిన వాటిలో రెండు, మూడు పేర్లను ఎంపిక చేసింది. అయితే వీటిలో 25కు పైగా సీట్లలో ఎంపికపై అభ్యంతరాలు రావడంతో ఆయా నియోజకవర్గాల్లో ఫ్లాష్ సర్వేలు నిర్వహిస్తున్నారు. పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆధ్వర్యంలో ఒక్కొక్కటి చొప్పున మూడు సంస్థలు ఈ ఫ్లాష్ సర్వేలు నిర్వహిస్తున్నాయి. ఈ మూడు సర్వేలను క్రోడీకరించి.. సామాజిక సమతుల్యతను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థుల ఎంపిక కసరత్తు చేపట్టాలని స్ర్కీనింగ్ కమిటీ భావిస్తోంది.
సామాజిక వర్గాల వారీగా డిమాండ్లు..
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ.. బీజేపీ బలహీనపడుతూ అధికార బీఆర్‌ఎ్‌సకు కాంగ్రెస్సే ప్రధాన పోటీదారుగా మారుతున్న నేపథ్యంలో పార్టీ టికెట్లకూ డిమాండ్ పెరిగింది. బీసీలు, ఇతర సామాజికవర్గాల వారు టికెట్లలో తమ వాటా కోసం అధిష్ఠానంపై ఒత్తిడి పెంచారు. అయితే కర్ణాటక ఎన్నికల తరహాలో విజయావకాశాలే ప్రాతిపదికగా అభ్యర్థుల ఎంపిక చేపట్టిన కాంగ్రెస్ పార్టీ.. బీసీలకు 25 నుంచి 27 సీట్ల వరకూ కేటాయించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. అయితే, బీసీ నాయకులు మాత్రం.. ఉదయ్‌పూర్ డిక్లరేషన్ ప్రకారం మొత్తం 34 సీట్లు కేటాయించాలని కోరుతూ మరో దఫా ఢిల్లీకి వెళ్లేందుకూసమాయత్తమవుతున్నారు. తాజాగా తెలంగాణ కమ్మ రాజకీయ ఐక్యవేదిక నాయకులు కూడా అధిష్ఠానం పెద్దలను కలిసి సీట్లలో కమ్మ సామాజికవర్గ నేతలకూ తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. మరో వైపు బీజేపీ, బీఆర్‌ఎస్ నుంచి పలువురు ముఖ్యనాయకులు కాంగ్రె్‌సలో చేరుతున్నారు. పార్టీ గెలుపే లక్ష్యంగా పలుచోట్ల వారికి సీట్లు కేటాయించాల్సి వస్తోంది. దీంతో ఇప్పటిదాకా ఆ సీట్లపై నమ్మకం పెట్టుకున్న నేతలకు తగిన హామీలనూ అధిష్ఠానం ఇవ్వాల్సి ఉంది.
సవాల్‌గా మారిన సర్దుబాటు..
పొత్తులో భాగంగా వామపక్షాలకు కేటాయించాల్సిన సీట్లనూ కాంగ్రెస్ గుర్తించాల్సి ఉంది. మొత్తం 119 స్థానాల్లోని 88 జనరల్ సీట్లలో గెలుపు ప్రాతిపదికన రెండొంతుల సీట్లను రెడ్డి, వెలమ నేతలకు కేటాయించాల్సిన పరిస్థితి ఇప్పటికే ఉంది. అయితే వీరితోపాటు బీసీలు, ఇతర అగ్రకులాల నేతలకు, వామపక్షాలకు మిగిలిన సీట్లను సర్దుబాటు చేయాల్సి ఉండడం సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఫ్లాష్ సర్వేల ఫలితాలను పరిగణనలోకి తీసుకుని.. నేతలతో సంప్రదింపులు, సమగ్ర పరిశీలన జరిపిన తర్వాతే అభ్యర్థులను ఎంపిక చేయాలనే యోచనలో అధిష్ఠానం ఉన్నట్లు చెబుతున్నారు. పార్టీ ముఖ్య నాయకుల ఐక్యతను ప్రజలకు చాటేందుకు ఈ నెల 15 నుంచి బస్సుయాత్ర చేపట్టనున్న నేపథ్యంలో ఆ యాత్ర ముగిసిన తర్వాతనే అభ్యర్థులను ప్రకటించాలన్న ఆలోచనలో అధిష్ఠానం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ లోపున సర్వేలు, సంప్రదింపుల ఆధారంగా అన్ని స్థానాల్లోనూ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని, అసంతృప్త నేతలకు తగిన హామీలిచ్చి ఎన్నికల ప్రచార రంగంలోకి దించాలని అధిష్ఠానం భావిస్తోంది. సీటు దక్కని నేతలతో డీకే శివకుమార్ స్వయంగా సమావేశమై.. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి హోదాలో తగు హామీలు ఇవ్వనున్నట్లు సమాచారం. అభ్యర్థుల ప్రకటన నాటికి అసంతృప్తి అనేది లేకుండా అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. కాగా, స్ర్కీనింగ్ కమిటీ ఎంపిక చేసిన పేర్లలోనూ చివరి క్షణంలో మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. బీఆర్‌ఎస్, బీజేపీ నుంచి బలమైన నేతలను పార్టీలో చేర్చుకున్నప్పుడు కూడా గెలుపు ప్రాతిపదికన కొత్త పేర్లు తెరపైకి వచ్చే అవకాశం ఉంది.
విశ్వసనీయ సమాచారం మేరకు ఏకాభిప్రాయం వచ్చిన పేర్లు
1. కొడంగల్ : రేవంత్‌రెడ్డి
2. మధిర : భట్టివిక్రమార్క
3. హుజూర్‌నగర్ : ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
4. నల్లగొండ : కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
5. మంథని : శ్రీధర్‌బాబు
6. సంగారెడ్డి : జగ్గారెడ్డి
7. భద్రాచలం : పొదెం వీరయ్య
8. ములుగు : సీతక్క
9. జగిత్యాల : జీవన్‌రెడ్డి
10. కొత్తగూడెం: పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి
11. పాలేరు : తుమ్మల నాగేశ్వర్‌రావు
12. నాగార్జున సాగర్ : జానారెడ్డి
13. కోదాడ : పద్మావతీరెడ్డి
14. నకిరేకల్ : వేముల వీరేశం
15. భువనగిరి: కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి
16. వరంగల్ ఈస్ట్ : కొండా సురేఖ
17. భూపాలపల్లి: గండ్ర సత్యనారాయణ
18. వర్థన్నపేట : కేఆర్ నాగరాజు
19. పాలకుర్తి : ఝాన్సీరెడ్డి
20. నర్సంపేట : దొంతి మాధవరెడ్డి
21. మంచిర్యాల : కొక్కిరాల ప్రేమ్ సాగర్‌రావు
22. ఆదిలాబాద్ : కంది శ్రీనివా్‌సరెడ్డి
23. ఆసిఫాబాద్ : శ్యామ్‌నాయక్
24. చెన్నూరు: నల్లాల ఓదెలు
25. ముథోల్ : డాక్టర్ కిరణ్‌కుమార్
26. సిర్పూర్ : రావి శ్రీనివాస్
27. నిర్మల్ : కూచాడి శ్రీహరిరావు
28. బెల్లంపల్లి : గడ్డం వినోద్‌కుమార్
29. వేములవాడ : ఆది శ్రీనివాస్
30. కోరుట్ల : జువ్వాడి నర్సింగరావు
31. సిరిసిల్ల : కేకే మహేందర్‌రెడ్డి
32. మానకొండూరు : కవ్వంపల్లి సత్యనారాయణ
33. పెద్దపల్లి : విజయ రమణారావు
34. కామారెడ్డి : షబ్బీర్ అలీ
35. బాల్కొండ : సునీల్ రెడ్డి
36. నిజామాబాద్ అర్బన్: ధర్మపురి సంజయ్
37. బోధన్ : సుదర్శన్‌రెడ్డి
38. ఎల్లారెడ్డి : మదన్‌మోహన్‌రావు
39. బాన్సువాడ : సుభా్‌షరెడ్డి
40. ధర్మపురి : అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
41. జహీరాబాద్ : ఎ.చంద్రశేఖర్
42. అందోల్ : దామోదర రాజనర్సింహ
43. మెదక్ : మైనంపల్లి రోహిత్‌రావు
44. గజ్వేల్ : నర్సారెడ్డి
45. తాండూరు : కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి
46. పరిగి : రామ్మోహన్‌రెడ్డి
47. వికారాబాద్ : గడ్డం ప్రసాద్‌కుమార్
48. శేరి లింగంపల్లి: ఎం.రఘునాథ యాదవ్
49. మల్కాజిగిరి : మైనంపల్లి హన్మంతరావు
50. ఇబ్రహీంపట్నం : మల్‌రెడ్డి రంగారెడ్డి
51. నాంపల్లి : ఫిరోజ్‌ఖాన్
52. షాద్‌నగర్ : వీరవల్లి శంకర్
53. కొల్లాపూర్ : జూపల్లి కృష్ణారావు
54. అచ్చంపేట : వంశీకృష్ణ
55. అలంపూర్ : సంపత్‌కుమార్
56. కల్వకుర్తి : కసిరెడ్డి నారాయణరెడ్డి
57. నాగర్ కర్నూల్ : కూచకుళ్ల రాజే్‌షరెడ్డి
58. నారాయణపేట : ఎర్ర శేఖర్
59. మహబూబ్‌నగర్ : యెన్నం శ్రీనివా్‌సరెడ్డి
60. గద్వాల్ : సరితా తిరుపతయ్య
61. జడ్చర్ల : అనిరుధ్‌రెడ్డి
62. ఆలేరు : బీర్ల ఐలయ్య
పోటీ ఉన్న నియోజకవర్గాలు
జనగామ : కొమ్మూరి ప్రతా్‌పరెడ్డి, పొన్నాల లక్ష్మయ్య
తుంగతుర్తి : డాక్టర్ రవి, పిడమర్తి రవి
రామగుండం: హర్కార వేణుగోపాల్, రాజ్ ఠాకూర్
వనపర్తి : మేఘారెడ్డి, చిన్నారెడ్డి
దేవరకద్ర: కొత్తకోట సిద్దార్థరెడ్డి, జి.మధుసూదన్‌రెడ్డి
హుజూరాబాద్ : బల్మూరు వెంకట్, వడితెల ప్రణవ్
సూర్యాపేట : రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, పటేల్ రమే్‌షరెడ్డి
మక్తల్ : పర్ణికారెడ్డి, శ్రీహరి ముదిరాజ్
ఖైరతాబాద్ : విజయారెడ్డి, రోహిన్‌రెడ్డి
హుస్నాబాద్ : పొన్నం ప్రభాకర్, మరో నేత
కరీంనగర్ : జైపాల్‌రెడ్డి, పురుమళ్ల శ్రీనివాస్, కె. నరేందర్‌రెడ్డి
చొప్పదండి: మేడిపల్లి సత్యం, సత్తు మల్లేశం
దుబ్బాక : చెరుకు శ్రీనివా్‌సరెడ్డి, కత్తి కార్తీక
నర్సాపూర్ : ఆవుల రాజిరెడ్డి, గాలి అనిల్ కుమార్
స్టేషన్ ఘన్‌పూర్ : సింగాపురం ఇందిర, మరో నేత
మహబూబాబాద్ : బలరాం నాయక్, మురళీ నాయక్
డోర్నకల్: రామచంద్రునాయక్, నెహ్రూ నాయక్,
వరంగల్ వెస్ట్: నాయిని రాజేందర్‌రెడ్డి, జంగా రాఘవరెడ్డి
పరకాల: కొండా మురళి, ఇనగాల వెంకట్రామిరెడ్డి
జూబ్లీహిల్స్ : అజరుద్దీన్, విష్ణు
కూకట్‌పల్లి : సతీష్, మురళి, గొట్టిముక్కల వెంగళ్‌రావు