దేశంలో ఒక మార్పు కోసం పుట్టిన పార్టీ BRS: కేసీఆర్

ABN , First Publish Date - 2023-01-02T20:35:57+05:30 IST

దేశంలో ఒక మార్పు కోసం బీఆర్‌ఎస్ పార్టీ (BRS Party) పుట్టిందని ఆ పార్టీ అధినేత కేసీఆర్ (KCR) ప్రకటించారు. దేశంలో గుణాత్మక మార్పు రావాలని ఆకాంక్షించారు.

దేశంలో ఒక మార్పు కోసం పుట్టిన పార్టీ BRS: కేసీఆర్

హైదరాబాద్: దేశంలో ఒక మార్పు కోసం బీఆర్‌ఎస్ పార్టీ (BRS Party) పుట్టిందని ఆ పార్టీ అధినేత కేసీఆర్ (KCR) ప్రకటించారు. దేశంలో గుణాత్మక మార్పు రావాలని ఆకాంక్షించారు. బీఆర్‌ఎస్ ఒక మహోన్నత యజ్ఞం మొదలు పెట్టిందని తెలిపారు. ఎందుకు బీఆర్‌ఎస్ అనేదానిపై త్వరలో ట్రైనింగ్ క్లాసులు (Training classes) నిర్వహిస్తామని తెలిపారు. దేశానికి ఒక సామూహిక లక్ష్యం ఉండాలని, దాని కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. కానీ మన దేశంలో ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా మారిందని, కులమతాల మధ్య కుంపట్లు పెట్టి గెలవడమే లక్ష్యం అయందని తప్పుబట్టారు. ఇది అవసరమా? దేశంలో ఏ వర్గమైనా సంతోషంగా ఉందా? అని కేసీఆర్ ప్రశ్నించారు.

‘‘ఒకప్పుడు రాజకీయాలు అంటే త్యాగం. దేశం ఏ దశకు చేరుకోవాలో ఆ దశకు చేరుకోలేదు. స్వాతంత్ర్య ఫలాలు పూర్తిస్థాయిలో సిద్ధించలేదు. అమెరికా, చైనా (America China)లో సాగుయోగ్యమైన భూములు చాలా తక్కువ. భారత్‌లో మాత్రం 83కోట్ల ఎకరాల సాగు భూమి ఉంది. దేశంలో ఏటా 1.40 క్యూసెక్కుల వర్షం కురుస్తోంది. దేశంలో 70వేల టీఎంసీ నీరు అందుబాటులో ఉంది. అన్ని రకాల పంటలకు అనుకూలమైన నేలలు దేశంలో ఉన్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా పనిచేసే జనాభా మన దేశంలో ఎక్కువగా ఉంది. ప్రపంచంలోనే అత్యధికమైన ఆహారోత్పత్తి దేశంగా భారత్ ఉండాలి. ఇన్ని వనరులు ఉన్నప్పటికీ.. విదేశాల నుంచి ఆహార ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటున్నాం. ఈ దుస్థితి నుంచి బయటపడాలి’’ అని కేసీఆర్ ఆకాంక్షించారు.

Updated Date - 2023-01-02T20:35:58+05:30 IST