Asifabad Dist.: కొడుకు వైద్యం కోసం ప్రమాదాన్ని లెక్కచేయని తండ్రి..

ABN , First Publish Date - 2023-08-01T10:48:25+05:30 IST

ఆసిఫాబాద్ జిల్లా: వరదలతో కొమురంబీం ఆసిఫాబాద్ జిల్లాలో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. లక్మాపూర్‌లో కొడుకు అత్యవసర వైద్యం అందించేందుకు ఆ తండ్రి పెద్ద సాహసం చేశారు. పీకల్లోతు వరదలో ప్రాణాలకు తెగించి ఆస్పత్రికి తీసుకువెళ్లారు.

Asifabad Dist.: కొడుకు వైద్యం కోసం ప్రమాదాన్ని లెక్కచేయని తండ్రి..

ఆసిఫాబాద్ జిల్లా: వరదలతో కొమురంబీం ఆసిఫాబాద్ జిల్లాలో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. లక్మాపూర్‌లో తన కొడుకు అత్యవసర వైద్యం అందించేందుకు ఆ తండ్రి పెద్ద సాహసం చేశారు. పీకల్లోతు వరదలో ప్రాణాలకు తెగించి ఆస్పత్రికి తీసుకువెళ్లారు. లక్మాపూర్ గ్రామానికి చెందిన కవిత, పవన్ దంపతుల ఏడాది బాబుకు రెండు రోజులుగా జ్వరం వస్తోంది. బాలుడు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఎలాగైనా ఆస్పత్రికి తీసుకువెళ్లాలని మరో బంధువుతో కలిసి బయలుదేరారు. మార్గమధ్యంలో వాగు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. ఎంతకూ ప్రవాహం తగ్గకపోవడంతో పవన్ తన కొడుకును చేతులతో పైకెత్తుకుని వాగు దాటారు. తాళ్లను పట్టుకుని తల్లీ, బంధువు వాగుదాటి ఆస్పత్రికి వెళ్లారు. బాహుబలి సీన్ తలపించేలా తల్లిదండ్రులు చేసిన ఈ సాహసం చర్చకు కారణమైంది. గిరిజన ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందనడానికి ఈ ఘటన ప్రత్యక్ష సాక్ష్యంగా చెప్పవచ్చు.

Updated Date - 2023-08-01T10:48:25+05:30 IST