Katakam Sudarshan: మావోయిస్ట్ అగ్రనేత కటకం సుదర్శన్ మృతి
ABN , First Publish Date - 2023-06-04T09:23:15+05:30 IST
మంచిర్యాల జిల్లా: మావోయిస్ట్ అగ్రనేత కటకం సుదర్శన్ ఆకస్మికంగా మృతి చెందారు. కేంద్ర కమిటీ పోలిట్ బ్యూరో సభ్యుడుగా సుదర్శన్ కొనసాగుతున్నారు.

మంచిర్యాల జిల్లా: మావోయిస్ట్ (Maoist) అగ్రనేత కటకం సుదర్శన్ (Katakam Sudarshan) ఆకస్మికంగా మృతి చెందారు. కేంద్ర కమిటీ పోలిట్ బ్యూరో సభ్యుడుగా సుదర్శన్ కొనసాగుతున్నారు. ఆయన స్వస్థలం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కన్నాల బస్తీవాసి.. గెరిల్లా వార్ (Guerrilla War)లో మంచి దిట్టగా పేరుపొందారు. మే 31వ తేదీన చత్తీస్ గఢ్ (Chattisgarh)లోని దండకారణ్యంలో సుదర్శన్ గుండె పోటు (Heart Attack)తో మరణించినట్టు కేంద్ర కమిటి ప్రకటించింది. నాలుగున్నర దశాబ్దాల క్రితం కటకం సుదర్శన్ ఉద్యమంలోకి వెళ్లారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.
