Airport: ఎయిర్‌పోర్ట్‌కు 15 నిమిషాలకో బస్సు
ABN , First Publish Date - 2023-12-13T10:02:23+05:30 IST
రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ రూట్లపై ప్రత్యేక దృష్టి సారించిన గ్రేటర్ ఆర్టీసీ(Greater RTC) 49 పుష్పక్ ఏసీ బస్సులను
- 49 పుష్పక్ ఏసీ బస్సులు
- నాలుగు రూట్లలో పుష్పక్ బస్సుల పరుగులు
హైదరాబాద్ సిటీ, (ఆంధ్రజ్యోతి): రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ రూట్లపై ప్రత్యేక దృష్టి సారించిన గ్రేటర్ ఆర్టీసీ(Greater RTC) 49 పుష్పక్ ఏసీ బస్సులను నాలుగు రూట్లలో 24 గంటల పాటు నడుపనుంది. ఎయిర్‌పోర్ట్(Airport)కు పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు సర్వీసులు అందుబాటులోకి తెస్తున్నదని ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు. ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే వారు రూ.5,260తో నెలవారీ బస్‌పాస్ తీసుకుంటే రోజూ పుష్పక్ ఏసీ బస్సుల్లో తమ గమ్యస్థానాలకు చేరవచ్చని అధికారులు చెబుతున్నారు. పుష్పక్ బస్సుల్లో రూ. 300 చార్జీతో బస్ టికెట్ తీసుకున్న ప్రయాణికులు మూడుగంటల పాటు ఆ టికెట్‌తో సిటీ బస్సుల్లో తిరిగొచ్చని ఆర్టీసీ అధికారులు తెలిపారు. మియాపూర్ ఎక్స్‌రోడ్, జేబీఎస్, సికింద్రాబాద్‌ల నుంచి పుష్పక్ ఏసీ బస్సుల ఆపరేషన్ నిర్వహిస్తునట్లు గ్రేటర్ ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు.
ఏజే రూట్ నెంబర్‌లో 20 బస్సులు
మియాపూర్ ఎక్స్‌రోడ్ నుంచి రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు రోజుకు 20 బస్సులు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. మియాపూర్ మెట్రోస్టేషన్, జేఎన్‌టీయూ, ఫోరమ్ మాల్, మలేషియన్ టౌన్‌షి్‌ప, శిల్పారామం, మైండ్ స్పేస్, బయోడైవర్‌సిటీ, టెలికాంనగర్, గచ్చిబౌలి ఓఆర్‌ఆర్ నుంచి రాజీవ్ గాంధీ ఎయిర్‌పోర్టుకు 15 నిమిషాలకు ఓ బస్సు నడుపుతున్నారు. మియాపూర్ నుంచి ఎయిర్‌పోర్ట్‌కు 90 నిమిషాల్లో బస్సు చేరుకుంటుందని అధికారులు చెబుతున్నారు.