Share News

Jayaram Ramesh: బీఆర్‌ఎస్ అంబాసిడర్ కారు మ్యూజియంలో ఉండాల్సిన రోజు వచ్చింది

ABN , First Publish Date - 2023-11-24T13:55:25+05:30 IST

Telangana Elections: గత కొన్ని నెలల క్రితం తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సాగిందని.. భారత్ జోడో యాత్ర తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని అర్థమైందని అఖిలభారత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ అన్నారు.

Jayaram Ramesh: బీఆర్‌ఎస్ అంబాసిడర్ కారు మ్యూజియంలో ఉండాల్సిన రోజు వచ్చింది

హైదరాబాద్: గత కొన్ని నెలల క్రితం తెలంగాణలో రాహుల్ గాంధీ (Rahul Gandhi) భారత్ జోడో యాత్ర సాగిందని.. భారత్ జోడో యాత్ర తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని అర్థమైందని అఖిలభారత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ (General Secretary of Akhil Bharat Congress Jayaram Ramesh) అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్‌కు (BRS) బీ టీమ్ బీజేపీ, సీ టీమ్ ఎంఐఎం అని వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు పార్లమెంట్‌లో ఒక టీఆర్ఎస్ ఎంపీ లేరని.. రాజ్యసభలోనూ లేరని తెలిపారు. అలాంటి తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీని (Sonia Gandhi) తెలంగాణ ద్రోహి అంటున్నాడు కేసీఆర్ అని మండిపడ్డారు. కేటీఆర్ (Minister KTR) మాట్లాడుతూ బ్రాండ్ తెలంగాణ తయారు చేశానంటున్నారని.. హైదరాబాదులో అనేక రకాల పరిశ్రమలను ఐటీ రంగాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకొచ్చారు.


తెలంగాణ ఏర్పడడానికి రెండో కారణం ఉద్యోగాలు అని అన్నారు. కానీ తెలంగాణలో పబ్లిక్ కమిషన్ ద్వారా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటిఫికేషన్లు పరీక్షలకే పరిమితమైందన్నారు. తెలంగాణలో నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తుందని.. కానీ ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కొడుకు, ముఖ్యమంత్రి కుమార్తె , ముఖ్యమంత్రి మేనల్లుడు పదవులు అన్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కేసీఆర్ కుటుంబానికి న్యాయం జరిగిందని.. కానీ పేదలకు, దళితులకు ఏం జరగలేదని వ్యాఖ్యలు చేశారు. 30 తర్వాత బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంకు బై బై చెప్పడానికి ప్రజల సిద్ధంగా ఉన్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీ గుర్తు కారు, ఆ కారు అంబాసిడర్ కారు, అది మ్యూజియంలో ఉండాల్సిన రోజు వచ్చిందంటూ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన గ్యారెంటీలకు, 30 తర్వాత ఎక్స్పైరీ డేట్ అయిపోతుంది అంటూ జయరాం రమేష్ వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Updated Date - 2023-11-24T13:55:29+05:30 IST