Gali Anil Kumar కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్.. గాలి అనిల్ కుమార్ రాజీనామా
ABN , First Publish Date - 2023-11-15T15:26:39+05:30 IST
కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. టీపీసీసీ ఉపాధ్యక్షుడు గాలి అనిల్ కుమార్ ( Gali Anil Kumar ) కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.
సంగారెడ్డి జిల్లా : కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. టీపీసీసీ ఉపాధ్యక్షుడు గాలి అనిల్ కుమార్ ( Gali Anil Kumar ) కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సమయంలో కొంత భావొద్వేగానికి గురయ్యారు. పటాన్ చెరువులోని తన కార్యాలయంలో అనిల్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గాలి అనిల్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాను.. అనుచరులతో మాట్లాడిన అనంతరం ఏ పార్టీలో చేరేది త్వరలోనే చెబుతాను. కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వారికి సముచిత స్థానం దొరకడం లేదు. సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని పార్టీ కోసం పనిచేశాను. టికెట్ల కేటాయింపులో బీసీలకు పూర్తిగా అన్యాయం జరిగింది. గత ఐదేళ్ల క్రితం టికెట్ ఇస్తానంటే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను. నాడు - నేడు నాకు పార్టీలో నాకు అన్యాయం చేశారు. నా కార్యకర్తల నిర్ణయంతో ముందుకు వెళ్తాను. రాబోయే రోజుల్లో నావర్గంతో చర్చించి ఏ పార్టీలో చేరేది నిర్ణయం తీసుకుంటాను. నేషనల్ పేపర్లకు యాడ్స్ ఇవ్వడంతో నాకు ED నోటీసులు అందాయి. ఇంత జరిగినా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం కనీసం మమ్మల్ని పలకరించలేదు’’ అని గాలి అనిల్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు..