Share News

Telangana Elections 2023: రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ఘర్షణలు.. సీఈఓ వికాస్ రాజ్ ఆరా

ABN , First Publish Date - 2023-11-30T11:32:09+05:30 IST

Telangana Polls: తెలంగాణ వ్యాప్తంగా ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు భారీ మొత్తంలో క్యూలైన్లలో బారులు తీరారు.

Telangana Elections 2023: రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ఘర్షణలు.. సీఈఓ వికాస్ రాజ్ ఆరా

Telangana Polls: తెలంగాణ వ్యాప్తంగా ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు భారీ మొత్తంలో క్యూలైన్లలో బారులు తీరారు. అయితే, కొన్నిచోట్ల ఘర్షణలు చోటు చేసుకున్నాయి. జనగామ, కామారెడ్డి, నాగర్ కర్నూల్, కొత్తగూడెం, పాలేరులో చిన్నపాటి ఘర్షణలు జరిగాయి. దాంతో ఆయా జిల్లాల ఘటనలపై సీఈఓ వికాస్ రాజ్ ఆరా తీశారు. వెంటనే ఘర్షణలను అదుపు చేయాలని ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు, పోలీస్ అధికారులకు సీఈఓ ఆదేశించారు. అలాగే ఎలాంటి అవాంఛనీయ సంఘనటనలు జరగకుండా చూడాలని డీజీపీని ఆదేశించారు. ఈ సందర్భంగా అక్కడక్కడ జరుగుతున్న గొడవలపై డీజీపీతో మాట్లాడిన సీఈఓ వికాస్ రాజ్.. పోలింగ్ సాయంత్రం వరకు జరగాల్సి ఉన్నందున సమస్యలు లేకుండా చూడాలని కోరారు.

Updated Date - 2023-11-30T11:47:36+05:30 IST