BRS: కామారెడ్డి బీఆర్ఎస్లో కుమ్ములాటలు
ABN , First Publish Date - 2023-11-04T10:02:32+05:30 IST
కామారెడ్డి బీఆర్ఎస్లో కుమ్ములాటలు తారాస్థాయికి చేరుకున్నాయి.
కామారెడ్డి: కామారెడ్డి బీఆర్ఎస్లో (BRS) కుమ్ములాటలు తారాస్థాయికి చేరుకున్నాయి. మాచారెడ్డి జడ్పీటీసీ సభ్యుడు మినుకూరి రాంరెడ్డిపై ఎంపీపీ లోయపల్లి నర్సింగ్ రావు దాడి చేశారు. దీంతో రాంరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మాచారెడ్డి మండల సన్నాహక సమావేశంలో ఇరువురి మధ్య ఈ గొడవ చోటు చేసుకుంది. చుక్కపూర్ గ్రామ ఎన్నికల ఇంచార్జ్ నియామకం విషయంలో వాగ్వాదం చెలరేగింది. ‘‘నేను చెప్పిన వారికే బాధ్యతలు ఇవ్వాలని, మధ్యలో నీ పెత్తనం ఏంటని రాంరెడ్డిపై నర్సింగ్ రావు దాడి చేశారు. ఈ క్రమంలో దాడి ఘటనకు సంబంధించి నర్సింగ్ రావుపై పార్టీ అధిష్టానానికి రాంరెడ్డి ఫిర్యాదు చేశారు.
మరోవైపు మాచారెడ్డి జడ్పీటీసీ సభ్యుడు మినుకూరి రామ్ రెడ్డిపై ఎంపీపీ నర్సింగ్ రావు దాడిని నిరసిస్తూ చుక్కపూర్ వద్ద రాంరెడ్డి అనుచరులు ఆందోళనకు దిగారు. నర్సింగ్ రావు దిష్టిబొమ్మను దహనం చేశారు. మండలంలో పార్టీ నాయకులను భయాందోళనకు గురి చేస్తున్న నర్సింగ్ రావుపై అధిష్టానం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.