Share News

Revanth Reddy: మాట నిలబెట్టుకున్న రేవంత్.. కొలువుల జాతర మొదలైంది

ABN , First Publish Date - 2023-12-07T14:49:02+05:30 IST

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) తన ప్రమాణాన్ని నిలబెట్టుకున్నారు. ఎన్నికల ముందు గాంధీభవన్ సాక్షిగా ఓ దివ్యాంగురాలు రజనీకి ఇచ్చిన హామీని

Revanth Reddy: మాట నిలబెట్టుకున్న రేవంత్.. కొలువుల జాతర మొదలైంది

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) తన ప్రమాణాన్ని నిలబెట్టుకున్నారు. ఎన్నికల ముందు గాంధీభవన్ సాక్షిగా ఓ దివ్యాంగురాలు రజనీకి ఇచ్చిన హామీని అమలు చేశారు. ఎల్బీ స్టేడియంలో సీఎంగా బాధ్యతలు చేపట్టగానే లక్షలాది ప్రజల సాక్షిగా రజనీకి ఉద్యోగం ఇస్తూ రేవంత్‌రెడ్డి తన హామీని నెరవేర్చారు. స్టేజీపైనే రజనీకి ఉద్యోగ పత్రాలను అందజేశారు. ముందుగా ఆరు గ్యారెంటీలపై రేవంత్‌రెడ్డి తొలి సంతకం చేయగా... అనంతరం రజనీకి ప్రభుత్వోద్యోగం ఇస్తూ రెండో సంతకం చేశారు.

cabinet.jpg

రజనీ బ్యాక్‌గ్రౌండ్ ఇదే..

నాంపల్లి నియోజకవర్గం బోయిగూడ కమాన్‌ ప్రాంతానికి చెందిన రజినీ అక్టోబరు 17న గాంధీభవన్‌లో రేవంత్‌రెడ్డిని కలిశారు. దివ్యాంగురాలిని కావడంతో తనకు ఉద్యోగం లభించడం లేదని, ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని, ఉద్యోగం ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. రజినీ, ఆమె కుటుంబసభ్యుల వివరాలు అడిగి తెలుసుకున్న రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ 6 గ్యారెంటీల కార్డును సంతకం చేసి ఇచ్చారు. తాను సీఎం అయ్యాక తొలి ఉద్యోగం రజనీకే ఇస్తానని హామీ ఇచ్చారు. మొత్తానికి రేవంత్ ఇచ్చిన హామీను అక్షరాల నిజం చేసి చూపించారు. తెలంగాణ నిరుద్యోగులకు ఒక భరోసాను ఇచ్చారు. ఈ పరిణామాలను ప్రశంసిస్తూ రేవంత్‌కు ప్రజలు జేజేలు కొడుతున్నారు.

పీజీ పూర్తై 11 సంవత్సరాల తర్వాత రజనీకి ఉద్యోగం లభించింది. ఉద్యోగం రావడంపై ఆమె సంతోషాన్ని వ్యక్తం చేస్తూ కొత్త ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపింది.

R-1.jpg

Updated Date - 2023-12-07T14:55:06+05:30 IST