Share News

Addanki Dayakar: టికెట్‌ రాకున్నా.. పార్టీ గెలుపు కోసం పనిచేస్తా

ABN , First Publish Date - 2023-11-15T16:14:11+05:30 IST

కాంగ్రెస్ పార్టీ కోసం రెబల్స్‌గా నామినేషన్ చేసిన అభ్యర్థులు విత్ డ్రా చేసుకోవడం చాలా సంతోషమని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ అన్నారు.

Addanki Dayakar: టికెట్‌ రాకున్నా.. పార్టీ గెలుపు కోసం పనిచేస్తా

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ (Congress) కోసం రెబల్స్‌గా నామినేషన్ చేసిన అభ్యర్థులు విత్ డ్రా చేసుకోవడం చాలా సంతోషమని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ (TPCC spokesperson Addanki Dayakar) అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. తనకు టికెట్ రాలేదని చాలా మంది ఫోన్ చేశారని... తనకు టికెట్ రాకున్నా, పార్టీ గెలుపు కోసం పనిచేస్తానన్నారు. కాంగ్రెస్‌లో మాల మాదిగలు అన్నదమ్ములలా ఉంటామని తెలిపారు. ‘‘2014లో నేను కాంగ్రెస్‌లో చేరిన నెల రోజులకే నాకు టిక్కెట్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ మారిన 12 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో నేను ప్రచారం చేస్తా. టికెట్ రాని నేతలంతా కలిసి 12 నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తాం. కాంగ్రెస్ పార్టీని వీడే నేతలంతా ఓడిపోయే పార్టీలోకి వెళ్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీ మధ్య లోపాయి కారి ఒప్పందం ఉంది. బీఆర్ఎస్ మీటింగ్‌లకు లేని నిబంధనలు కాంగ్రెస్‌కే ఎందుకు?. మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం చచ్చిపోతుంది. హాంగ్ కోసం బీజేపీ ప్రయత్నిస్తుంది’’ అంటూ అద్దంకి దయాకర్ వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-11-15T16:14:13+05:30 IST