Share News

Ramakrishna: టీఆర్‌ఎస్.. బీఆర్‌ఎస్‌‌గా మారింది.. కానీ బుద్దే మారలేదు..

ABN , First Publish Date - 2023-11-24T16:08:36+05:30 IST

Telangana Elections: తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. శుక్రవారం కొత్తగూడెం సీపీఐ అభ్యర్థి కూనంనేనికి మద్దతుగా రామకృష్ణ ప్రచారం నిర్వహించారు.

Ramakrishna: టీఆర్‌ఎస్.. బీఆర్‌ఎస్‌‌గా మారింది.. కానీ బుద్దే మారలేదు..

భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు (BRS) వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (CPI Leader Ramakrishna) అన్నారు. శుక్రవారం కొత్తగూడెం సీపీఐ అభ్యర్థి కూనంనేనికి (CPI Candidate Kunamneni) మద్దతుగా రామకృష్ణ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ (CM KCR) అహంకారానికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇస్తారని తెలిపారు. పోరాటాల గడ్డ తెలంగాణ అని అన్నారు. చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) అక్రమ అరెస్ట్‌పై మంత్రి కేటీఆర్ (Minister KTR) వ్యాఖ్యలు అహంకారంగా ఉన్నాయన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ పేరు బీఆర్‌ఎస్‌గా మారింది కానీ బుద్ది మారలేదని వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ అతి తెలివితో డబ్బు మదంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మోదీ (PM Modi), కేసీఆర్, జగన్ (AP CM Jagan)ముగ్గురు ఒక్కటే అని అన్నారు. అహంకారంతో ముగ్గురు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లో స్థిరపడ్డ సీమాంధ్ర ప్రజలు బీజేపీ, బీఆర్‌ఎస్‌ను చిత్తు చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో బీజేపీతో పొత్తుపై పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) త్వరలో కళ్లు తెరుస్తారన్నారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకుండా చంద్రబాబు మంచి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణలో పోటీ చేయకుండా ఉండాల్సిందని రామకృష్ణ అభిప్రాయపడ్డారు.

మరిన్ని పోరు తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Updated Date - 2023-11-24T16:08:37+05:30 IST