Share News

Gadari Kishore Kumar: సారు..కారు... మళ్లీ రావాలి సర్కారు.. ఇదే మా నినాదం

ABN , First Publish Date - 2023-11-20T17:15:25+05:30 IST

సారు..కారు... మళ్లీ రావాలి సర్కారు.. ఇదే మా నినాదమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ( Gadari Kishore Kumar ) అన్నారు. సోమవారం నాడు తుంగతుర్తి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Gadari Kishore Kumar: సారు..కారు... మళ్లీ రావాలి సర్కారు.. ఇదే మా నినాదం

సూర్యాపేట: సారు..కారు... మళ్లీ రావాలి సర్కారు.. ఇదే మా నినాదమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ( Gadari Kishore Kumar ) అన్నారు. సోమవారం నాడు తుంగతుర్తి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గాదరి కిషోర్ కుమార్ మాట్లాడుతూ..‘‘తుంగతుర్తి నియోజకవర్గానికి 95 వేల ఎకరాలకు గోదావరి జలాలు అందించిన ఘనత కేసీఆర్‌దే. కాంట్రాక్టర్లను బాగు చేసేందుకు ఎస్సారెస్పీ కాలువలు తవ్వారు. 2014కు ముందు 50వేల మెట్రిక్ టన్నుల ధాన్యం పండితే బీఆర్ఎస్ పాలనలో 3లక్షల 79వేల మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతుంది. ఏ ఊరికి పోయినా అప్పట్లో స్తూపం కనపడేది... ప్రస్తుతం మిషన్ భగీరథ ట్యాంకులు కనిపిస్తున్నాయి. తుంగతుర్తిలో జరిగిన అభివృద్ధితోనే మళ్లీ ఈ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయం’’ అని గాదరి కిషోర్ కుమార్ తెలిపారు.

Updated Date - 2023-11-20T17:15:30+05:30 IST