Medak : ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉదయం 9 గంటల వరకు పోలింగ్ శాతం వివరాలు..
ABN , First Publish Date - 2023-11-30T10:35:25+05:30 IST
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈ ఉదయం 9 గంటల వరకు పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి. పోలింగ్ కేంద్రాల్లో జనాలతో బారులు తీరుతున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈ ఉదయం 9 గంటల వరకు పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి. పోలింగ్ కేంద్రాల్లో జనాలతో బారులు తీరుతున్నారు. అంతా పోలింగ్ హడావుడి మధ్య ఇప్పటి వరకూ పోలింగ్ మెదక్ జిల్లా లో నమోదయిన పోలింగ్ వివరాలు ఇలా ఉన్నాయి.
సంగారెడ్డి జిల్లా
జిల్లా సగటు పోలింగ్ 9.49 శాతం నమోదయింది.
1. సంగారెడ్డి నియోజకవర్గంలో ఉదయం 9 గంటల వరకు 11.34 శాతం పోలింగ్ నమోదయింది.
2. పటాన్చెరు నియోజకవర్గంలో
ఉదయం 9 గంటల వరకు 6.23 ఓటింగ్ శాతం నమోదు అయింది.
3. ఆందోల్ నియోజకవర్గంలో ఉదయం 9 గం. వరకు 14.03 పోలింగ్ శాతం నమోదు అయింది.
4. నారాయణ ఖేడ్ నియోజకవర్గంలో 9 గంటల వరకు 10.35 శాతం పోలింగ్ నమోదు అయింది.
5. జహీరాబాద్ లో 9.99 శాతం పోలింగ్ నమోదు అయింది.
మెదక్ జిల్లా
జిల్లా సగటు పోలింగ్ 9.49 శాతం వరకూ నమోదు అయింది.
1. మెదక్ నియోజకవర్గంలో ఉదయం 9 గంటల వరకు 9.99 శాతం పోలింగ్ నమోదు అయింది.
2. నర్సాపూర్ నియోజకవర్గంలో 9.01 శాతం పోలింగ్ నమోదు అయింది.